
రాట్నాలమ్మకు రూ.1,16,385 ఆదాయం
పెదవేగి: ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలోని రాట్నాలమ్మను దర్శించుకునేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా భక్తులు చిన్నారులకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు, నూతన వస్త్ర బహూకరణలు, నామకరణలు చేశారు. ఈ వారం అమ్మవారికి పూజా రుసుం వలన రూ 71,400, విరాళాలుగా రూ10,245, లడ్డూ ప్రసాదంతో రూ30,390, పులిహోర అమ్మకంతో రూ.1035, ఫొటోల అమ్మకంతో రూ.3,315, మొత్తం రూ.1,16,385 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్‌కుమార్ చెప్పారు.
విద్యుత్ దీపాలకు రూ.4.23 లక్షల అందజేత
భీమవరం (ప్రకాశంచౌక్): ద్వారకా తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు కాలినడక వెళ్లే భక్తుల కోసం జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరఫున రూ.4.23 లక్షలు విద్యుత్ దీపాల ఏర్పాటుకు అసోసియేషన్ అధ్యక్షుడు సామంతపూడి శ్రీరామరాజు అందించారు. ఇటీవల ఒక భక్తుడు పాము కాటుకు గురయ్యాడని తెలవడంతో మిల్లర్స్ అసోసియేషన్ సామాజిక సేవా సంస్థ నుంచి ఈ మొత్తం అందించారు.