
బెల్టుషాపులను ప్రోత్సహించడం సిగ్గుచేటు
బెల్టు షాపులను ప్రభుత్వ మే ప్రోత్సహించడం సిగ్గుచేటని, గీత వృత్తిని కాపాడాలంటూ పీడీఎఫ్ ఎమ్మె ల్సీ బొర్రా గోపిమూర్తి , ఏపీ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్య దర్శి జుత్తిగ నరసింహామూర్తి డిమాండ్ చేశారు. భీమవరంలో కలెక్టరేట్ వద్ద కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘కలెక్టర్ గారికి చెప్పుకుందాం రండి’ పేరుతో ధర్నా చేపట్టారు. గీత కార్మికులు మోకులతో వినూత్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో జేసీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ గోపిమూర్తి రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం దొరుకుతుందని, ప్రభుత్వ విధానాలు, ఎకై ్సజ్ పాలసీల వలన కల్లుగీత కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. నరసింహమూర్తి మాట్లాడుతూ కల్తీ మద్యాన్ని అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని, బెల్ట్‌షాపులు ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో ఎకై ్సజ్ అధికారుల సహకారంతో నడుస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి బొక్కా చంటి, సంఘ జిల్లా అధ్యక్షుడు కామన మునిస్వామి పాల్గొన్నారు.