
మహిళలకు రక్షణ కరువు
కై కలూరు: కూటమి పాలనలో మహిళలకు పూర్తిగా రక్షణ కరువైందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీలు గంటా సంధ్య, కూసంపూడి కనక దుర్గారాణి మండిపడ్డారు. ఉమ్మడి కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక కారుపై గుడివాడలో జరిగిన దాడిని ఖండిస్తూ కై కలూరు పార్టీ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎన్నికల్లో కూటమి పాలనలో మహిళలపై దాడులను జరగనివ్వమని పదేపదే వల్లించిన వాగ్ధానాలు ఇప్పుడేమయ్యాయని? ప్రశ్నించారు. హోం మంత్రి అనిత సాటి మహిళగా ఇలాంటి దాడులను ఖండిచాలన్నారు. జిల్లా ప్రథమ పౌరురాలు రక్షణ కల్పించండని వేడుకున్నా పోలీసులు చోద్యం చూశారన్నారు. ముదినేపల్లి వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ సభ్యురాలు ఈడే వెంకటేశ్వరమ్మ, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు దున్నా బేబీ మాట్లాడుతూ మహిళలపై దాడులు పెరుగుతున్నా అదుపు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. బీసీ వర్గానికి చెందిన మహిళా చైర్‌పర్సన్‌పై దాడి అమానుషమన్నారు. ముదినేపల్లి మండల వైస్ ఎంపీపీ రాచూరి రాధ, ఆటపాక 1, ఆడపాక 2 ఎంపీటీసీ సభ్యులు తమ్మిశెట్టి లక్ష్మీ, పట్టపు బాలమ్మ, మహిళా నాయకులు అర్జ విజయదుర్గ, మద్దా రాణి, ఆరేపల్లి శివ నాగలక్ష్మీ, తేరా జ్ఞానావతి పాల్గొన్నారు.

మహిళలకు రక్షణ కరువు