
అర్జీల పరిష్కారానికి చర్యలు
భీమవరం: బాధితుల సమస్యలపై సానుకూలంగా స్పందించి తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశించారు. సోమవారం పట్టణంలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీదారులతో ము ఖాముఖి మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మొత్తంగా 12 ఫిర్యాదులు అందగా ఆయా పోలీస్‌స్టేషన్ల అధికారులతో ఎస్పీ మాట్లాడారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ దేశంశెట్టి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.