
ఎస్టీ మహిళ రిజర్వేషన్ కొనసాగించాలి
భీమవరం మార్కెట్ యార్డ్ చైర్మన్‌కు సంబంధించి ఎస్టీ మహిళ రిజర్వేషన్ కొనసాగించాలని ఎస్టీ సంఘాల నాయ కులు డిమాండ్ చేశారు. భీమవరం ఏఎంసీ చైర్మన్ రిజర్వేషన్ మార్చడంపై సోమవారం కలెక్టరేట్‌కు ఎస్టీ సంఘాల నాయకులు సాలా శ్రీను ఆధ్వర్యంలో వచ్చి నిరసన తెలిపారు. అనంతరం జేసీకి వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్‌సీపీ ఎంబీసీ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న మాట్లాడుతూ మొదటగా భీమవరం ఏఎంసీ చైర్మన్‌ను ఎస్టీ మహిళకు కేటాయించి తర్వాత ఓసీ మహిళగా మార్చడం అన్యాయమన్నారు. కూటమి ప్రభుత్వానికి ఎస్టీలపై ఉన చిన్నచూపునకు ఇది నిదర్శనమన్నారు. కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే పక్కన ఎస్టీ మహిళ చైర్మన్ హోదాలో కూర్చోవడానికి అర్హురాలు కాదా అని ప్రశ్నించారు. ఏఎంసీని ఎస్టీ మహిళకు కేటాయించకుంటే పోరాటం చేస్తామని హె చ్చరించారు. సాలా వెంకటేశ్వరరావు, కారంపూడి అనంతనాగు, నల్లగుంట ఏసు, బండి రాంబాబు పాల్గొన్నారు.