
మహమ్మారి మద్యం.. బతుకులు ఛిద్రం
జిల్లాలో జరిగిన సంఘటనలు
●
● మార్చి 19న తణుకు గణేష్‌చౌక్ ప్రాంతంలోని మద్యం షాపు నైట్ పాయింట్ వద్దకు అర్ధరాత్రి సమయంలో మద్యం కొనేందుకు వచ్చిన వ్యక్తికి సిబ్బందికి డిజిటల్ పేమెంట్ విషయమై వివాదం తలెత్తింది. సదరు వ్యక్తి ఇనుప రాడ్‌తో విచక్షణరహితంగా దాడి చేయడంతో సిబ్బంది ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
●
● మార్చి 29న తణుకు రూరల్ వేల్పూరులోని మద్యం దుకాణం కాంపౌండ్‌లో అనుమానాస్పద రీతిలో వ్యక్తి మృతి చెందడం వివాదస్పదంగా మారింది. అతడి ఒంటిపై గాయాలున్నాయని, మద్యం దుకాణం వద్ద ఎవరో కొట్టి హత్యచేశారని ఆరోపిస్తూ బంధువులు వైన్స్ షాపు వద్ద ఆందోళనకు దిగారు.
●
● మే 12న కాళ్ల మండలం ఎల్‌ఎన్ పురంలో చెరువుల వద్ద ఇద్దరు యువకులు కలిసి మద్యం సేవిస్తుండగా వివాదం తలెత్తింది. మద్యం మత్తులో ఒక యువకుడు మరో యువకుడిపై చాకుతో దాడిచేయగా తీవ్ర గాయాలతో మృతిచెందాడు.
●
● మే 27న రాత్రి సమయంలో భీమవరం రైల్వే ఫ్లై ఓవర్‌పై మద్యం మత్తులో ఓ యువతి రోడ్డుపై అడ్డంగా పడుకుని హల్‌చల్ చేసింది. అర గంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
●
● జూన్ 13న రాయలంకు చెందిన వ్యక్తి మద్యం సేవించి కాళ్ల మండలం పెదఅమిరంలోని ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డు పక్కన రాయిపై పడిపోవడంతో గాయమై మృతి చెందాడు.
●
● జూన్ 15న ఓ డ్రైవర్ మద్యం మత్తులో కారు నడుపుతూ ముగ్గురిని ఢీకొట్టిన ఘటన ఆకివీడులోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.
●
● జూన్ 30న ఇరగవరం మండలం అర్జునుడుపాలెంలో మద్యం మత్తులో ఒక వ్యక్తి తన భార్య, కుమార్తైపె చాకుతో దాడి చేయడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
●
● జూలై 3న భీమవరం టూటౌన్ పరిధిలోని ఒక ప్రదేశంలో మద్యం సేవిస్తున్న ఇద్దరు యువకుల మధ్య కోడిగుడ్డు విషయమై ఘర్షణ తలెత్తడంతో ఒక యువకుడు బ్లేడుతో మరో యువకుని గొంతు కోయడంతో తీవ్ర గాయాలయ్యాయి.
●
● జూలై 6న తాడేపల్లిగూడెంలోని భీమవరం బైపాస్ రోడ్డులోని మద్యం దుకాణం వద్ద కలిసి మద్యం సేవిస్తున్న ఇద్దరు కూలీల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఒకరు నాపరాయితో దాడి చేయడంతో మరో కూలీ మృతిచెందాడు.
●
● ఇవి జిల్లాలో చోటుచేసుకున్న ఘటనల్లో కొన్ని మాత్రమే. మద్యం మత్తులో జరిగిన రోడ్డు ప్రమాదాలు, వెలుగుచూడని, పోలీస్‌స్టేషన్ వరకూ చేరని ఘటనలు మరెన్నో.
సాక్షి, భీమవరం: జిల్లాలో గీత కార్మికులకు చెందిన 18 షాపులతో కలిపి 193 మద్యం షాపులు ఉన్నాయి. నెలకు రూ.120 కోట్ల వరకు అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా. కాగా జిల్లాలో నెలకు రూ.175 కో ట్ల వరకు మద్యం అమ్మకాలు చేయాలని ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు రోజుకు సగటున రూ.6 కోట్లు వరకు మద్యం అమ్మకాలు చేయాల్సి ఉంది. లక్ష్యాన్ని చేరేందుకు నిబంధనల అమలులో అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా లిక్కర్ సిండికేట్లు ఎకై ్సజ్ పాలసీని తుంగలోకి తొక్కుతున్నాయి. బెల్టు షాపులు, సిట్టింగ్ ఏర్పాట్లు, మంచింగ్ కోసం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు అందుబాటులో ఉంచుతున్నారు. లూజ్ సేల్స్, నైట్ పాయింట్లు పేరిట వేళాపాలా లేకుండా మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. గతంతో పోలిస్తే ప్రైవేట్ పాలసీ వచ్చాక 25 శాతం మేర లిక్కర్, 80 శాతం మేర బీర్లు అమ్మకాలు పెరిగాయి. వీటిని మరింత పెంచుకునే పనిలో ఎకై ్సజ్ శాఖ ఉంది.
శాంతిభద్రతలకు విఘాతం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఊరికి దూరంగా ఉన్న మద్యం దుకా ణాలు.. కూటమి తెచ్చిన ప్రైవేట్ పాలసీతో జనావాసాలు, రద్దీ ప్రాంతాల్లోకి వచ్చేశాయి. ప్రస్తుతం అమ్మకాలు పెంచుకునేందుకు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. ఏనీ టైం ఎక్కడపడితే మద్యం దొరికే పరిస్థితులు ఉన్నాయి. వేళాపాలా లేకుండా మందుబాబులు మత్తులో జోగుతూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. ఒక్కోసారి హత్యలకు సైతం దారితీస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. జనావాసాల్లోని షా పుల వద్ద మందుబాబుల ఆగడాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తోంది.
తెగ తాగించేస్తున్నారు
మద్యం నుంచి సంపద సృష్టిలోకూటమి సర్కారు
జిల్లాకు నెలవారీ టార్గెట్లు
నెలకు రూ.175 కోట్ల మద్యం విక్రయించాల్సిందే..
లక్ష్యం చేరేందుకు విచ్చలవిడిగా అమ్మకాలు
మద్యం మత్తులో హత్యలు, దాడులకు తెగబడుతున్న మందుబాబులు
గత ప్రభుత్వంలో పక్కాగా నిబంధనలు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణాలు ప్రభుత్వ అధీనంలో ఉండటం వలన కచ్చితంగా నిబంధనలు అమలయ్యేవి. నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు జరిగేవి. షాపు వద్ద మద్యం కొనుగోలు చేసి తీసుకుపోవడమే తప్ప అక్కడే కూర్చుని తాగే వీలుండేది కాదు. బెల్టుషాపులకు ఆస్కారమే లేదు. ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా తయారైందని ప్రజలు విమర్శిస్తున్నారు.
అమ్మకాలను కట్టడి చేయాలి
ఈ ప్రభుత్వం వచ్చాక మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. సమయపాలన లేకుండా ఎక్కడిపడితే అక్కడ మద్యం దొరుకుతుండటంతో క్రైం రేటు పెరుగుతోంది. జిల్లాలో లిక్కర్, బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మద్యం అమ్మకాల కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. – కర్రా జయసరిత, న్యాయవాది, పాలకొల్లు

మహమ్మారి మద్యం.. బతుకులు ఛిద్రం

మహమ్మారి మద్యం.. బతుకులు ఛిద్రం