
బీడు వారిన భూములు
దెందులూరు: దెందులూరు మండలంలో సాగునీరు అందక నారుమళ్లు ఎండిపోతున్నాయి. పోతునూరు, కేదవరం, గుండుగొలనుతో పాటు దెందులూరు శివారు ప్రాంతాల్లో 450 ఎకరాలకు పైగా పొలాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారింది. గోదావరి కాలువకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో ఈ పరిస్థితి ఉండటంతో రైతులకు దిక్కుతోచడం లేదు. ఎవరికి చెప్పాలో తెలియక ఎప్పుడు నీళ్లు వస్తాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు. అందరూ సన్నా చిన్నకారు రైతులే. ప్రభుత్వం మాత్రం వందల ఎకరాల్లో సాగునీరు లేక పంట ఎండుతున్నా.. పట్టించుకోకపోవడంపై రైతులు, రైతు కూలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు కూడా కనీసం ఏం జరుగుతుందో.. పరిశీలన కూడా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ ఉద్యోగులు పట్టించుకోకపోతే జిల్లా అధికారులకు ఈ విషయం ఏం తెలుస్తుందని.. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో కూడా లేకపోతే తమ సమస్య ఎప్పటికీ పరిష్కారం అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.
దెందులూరు నియోజకవర్గంలో నారుమళ్లకు అందని సాగు నీరు
450 ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకం

బీడు వారిన భూములు