
క్షయ నివారణలో కృషికిఅవార్డు
తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని టీబీ విభాగ సీనియర్ ల్యాబ్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పంజా రవిబాబు బెస్ట్ అవార్డును అందుకున్నారు. ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్షయ నివారణ కార్యాలయంలో సోమవారం జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్ భానునాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో డీఎంహెచ్‌వో గీతాబాయి చేతులమీదుగా అవార్డు అందుకున్నారు.
ఎన్టీఆర్ వైద్య సేవ సిబ్బంది ధర్నా
భీమవరం : డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఫీల్డ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఫీల్డ్ లెవల్ సిబ్బందికి మినిమం స్కేల్, కేడర్, ఉద్యోగ భద్రత, ఎక్స్‌గ్రేషియా, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ వంటివి అమలు చేయాలని అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు కార్యచరణ సిద్ధం చేశామని, ట్రస్ట్ సీఈవో పిలుపు మేరకు వాయిదా వేసి 12న చర్చలో పాల్గొనగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కోశాధికారి డి.రామ్మోహన్, డి.వెంకటరమణ, నాగచార్యులు, తదితరులు పాల్గొన్నారు.
పాలిసెట్‌కు దరఖాస్తుల స్వీకరణ
తాడేపల్లిగూడెం (టీఓసీ): రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్–2025 పరీక్ష ఏప్రిల్ 30న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, జిల్లా కోఆర్డినేటర్ డి.ఫణీంద్ర ప్రసాద్ వెల్లడించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఈ నెల 12 నుంచి ఏప్రిల్ 15 వరకు అందుబాటులో ఉంటాయని, దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.400, ఎస్సీ, ఎస్టీలకు రూ.100 రుసు చెల్లించాలని చెప్పారు. అభ్యర్థులకు తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో నిష్ణాతులైన అధ్యాపకులచే ఏప్రిల్ 1 నుంచి పాలిసెట్ కోసం శిక్షణ అందజేస్తారని చెప్పారు. స్టడీ మెటీరియల్ ఉచితంగా ఇస్తారని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 90102 22178, 94901 04336 నెంబర్లలో సంప్రదించాలన్నారు.
చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించాలి
భీమవరం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే బాధితుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి చట్ట పరిధిలో తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో 18 అర్జీలు స్వీకరించారు. అర్జీదారులతో స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
నాటు సారా అనర్థాలపై అవగాహన
భీమవరం: నాటు సారాతో అనర్థాలను ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి నిర్మూలనకు కృషి చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి చెప్పారు. సోమవారం కలెక్టరేట్‌లో ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదగా నవోదయం– నాటు సారా నిర్మూలన కార్యక్రమంపై అవగాహన పోస్టర్, బుక్‌లెట్ ఆవిష్కరించారు. నాటు సారాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు గ్రామాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి, డీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ప్రోహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత పాల్గొన్నారు.

క్షయ నివారణలో కృషికిఅవార్డు