
ఇంటింటికీ పోలీసుల కాపలా
సాక్షి, భీమవరం/ తణుకు అర్బన్: వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు సీఎం చంద్రబాబు తణుకు పర్యటన సాగింది. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా సీఎం శనివారం పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే అడుగడుగునా పోలీసులా ఆంక్షలతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఓ ఏరియా ప్రజలను ఉదయం నుంచి సాయంత్రం వరకు గృహనిర్భంధం తరహాలో బయటకు రానివ్వలేదు. తణుకు రూరల్ తేతలిలో అక్రమ పశువధతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక కొండాలమ్మ పుంత, మహాలక్ష్మి నగర్ ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. సీఎం వద్ద తమ గోడు వెల్లబోసుకోవాలని స్థానికులు భావించారు. అయితే ఆయా ప్రాంతాల నుంచి ప్రజలెవరూ బయటకురాకుండా పోలీసులు గృహనిర్భంధం చేశారు. పర్యటన ముగిసిన సాయంత్రం 4 గంటల వరకు గృహ నిర్బంధం కొనసాగింది. సజ్జాపురం అండర్ పాస్ వద్ద పోలీసు పహారాతో పాటు ఇళ్ల వద్ద సచివాలయ పోలీసులు, సిబ్బందిని కాపలా ఉంచారు. దీంతో పిల్లలను పాఠశాలలకు పంపేందుకు, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం బయటకు వెళ్లడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సమస్యలు చెప్పుకునే అవకాశం లేకపోవడంతో..
సీఎంతో తమ సమస్యలు చెప్పుకోవాలన్న ఆశతో పలువురు ప్రజావేదిక వద్దకు వచ్చారు. మాట్లాడేందుకు వారికి మైక్ ఇవ్వకపోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సీఎంకు కొందరు తమ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం చేయగా తర్వాత వింటానంటూ ఆయన చెప్పడంతో పోలీసులు వారిని బలవంతంగా కూర్చోబెట్టారు. ఎంతో కష్టపడి సభకు వస్తే సమస్యలు వినే వారే లేకుండా పోయారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ వెనుదిరిగారు.
కడసారి చూసేందుకూపోలీసుల కాపలాతోనే
స్థానిక మహలక్ష్మి నగర్‌కు చెందిన కర్రి రాజశేఖర్ సమీప బంధువు ఏలూరులోని పోతునూరులో మృతిచెందడంతో అంత్యక్రియల్లో పాల్గొ నేందుకు కుటుంబ సభ్యులు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. వారిని బయటకు పంపేందుకు మొదట పోలీసులు అంగీకరించలేదు. విషయాన్ని నిర్ధారించుకున్న అనంతరం ఆటోలో దగ్గరుండి వారిని అక్కడ దింపి వచ్చినట్టు స్థానికులు తెలిపారు. పాఠశాలల్లోని తమ పిల్లలకు క్యారేజీలు ఇచ్చేందుకు సైతం పోలీసులు వెంట వచ్చారన్నారు. గృహనిర్భంధంపై కొందరు పోలీసులతో వాగ్వావాదానికి దిగారు. మరోపక్క పోలీసుల హెచ్చరికలతో వ్యాపారులు సైతం తమ దుకాణాలను అరకొరగానే తెరిచారు.
చల్లవారిగూడెంలో ఇంకా పునాది దశలోనే
ఉన్న నిర్మాణాలు
జంగారెడ్డిగూడెం: మండలంలోని చల్లవారిగూడెం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో ఓపీడీఆర్ నిజ నిర్ధారణ కమిటీ శనివారం పర్యటించింది. ఐదుగురు సభ్యుల బృందం కాలనీలో పర్యటించి ప్రజల నుంచి వివరాలు సేకరించింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు మాట్లాడుతూ గోదావరి వరదల నేపథ్యంలో కూనవరం, వేలేరుపాడు, కక్కునూరు, పోలవరం, వీఆర్‌పురం, వి.రామచంద్రాపురం, చింతూరు గ్రామాలకు చెందిన నిర్వాసితులకు చల్లవారిగూడెంలో ఇళ్లను ఇచ్చారని.. ఆ ప్రాంతంలో పెద్ద గోతులు, తుప్పలతో నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. దీంతో నిర్వాసితులే సొంత సొమ్ములు ఖర్చు చేసి గోతులను సరిచేసుకున్నారని సదరు సొమ్మును ప్రభుత్వం వెంటనే చెల్లించాలన్నారు. చల్లవారిగూడెం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో అసంపూర్తి నిర్మాణాలు 2 వేలకు వరకు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం వెంటనే నిర్మించాలన్నారు. నాలుగు ఓవర్ హెడ్ ట్యాంక్‌ల్లో ఒక్కటే పనిచేస్తుందని, నీటి కోసం కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే మిగిలిన మూడు ఓవర్‌హెడ్ ట్యాంక్‌లను వాడుకలో తీసుకురావాలన్నారు. వెంటనే రైతు భరోసా, తల్లికి వందనం తదితర సంక్షేమ కార్యక్రమాలు కాలనీలో వెంటనే అమలు చేయాలని డిమండ్ చేశారు. కమిటీలో జాతీయ అధ్యక్షుడు చిగురుపాటి భాస్కరరావు, సభ్యులు రిటైర్డ్ ఐఏఎస్ బండ్ల శ్రీనివాస్ తదితరులున్నారు.
ఉదయం 8 గంటలకు చంద్రబాబు హెలీప్యాడ్ వద్దకు చేరుకోవాల్సి ఉండగా 9 గంటలకు రావడంతో గంట ఆలస్యంగా పర్యటన మొదలైంది. ఎన్టీఆర్ పార్కులో పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖీ, చెత్త ఊడ్చే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన కంపోస్ట్ ద్వారా డిస్పోజ్ చేసే యంత్రాలను పరిశీలించారు. ఐక్య నగర్ పార్కును పరిశీలించి పీ4 విధానంలో అభివృద్ధి చేసేందుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. అనంతరం ప్రజావేదిక వద్ద ఉదయం 10.36 నుంచి 12.40 గంటల వరకు కార్యక్రమం సాగింది. గంటన్నర ఆలస్యం కావడంతో ఎండకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరోపక్క భోజనాలు లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. భోజనాలు లేవని టేబుళ్లను తీసేయడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. ఇంటి వద్ద వంట చేసుకోకుండా వచ్చేశామని, ఇంత ఎండలో ఇప్పుడు ఇంటికి వెళ్లి వంట ఎలా చేసుకునేదంటూ కొందరు మహిళలు వాపోయారు.
ఉసూరుమంటూ ఇంటిముఖం
క్రొవ్విడిలో దారుణం
నిడమర్రు: కొల్లేరు జీరాయితీ చేలల్లో చేపలు పడుతున్నాడంటూ ఓ బాలుడిని కొట్టి గొలుసుతో కట్టేసిన సంఘటన శుక్రవారం నిడమర్రు మండలం క్రొవ్విడిలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం 5వ కాంటూరు పరిధిలో నిరుపయోగంగా ఉన్న చేలల్లో ఉప్పరగుడెంకు చెందిన తాటిపర్తి బుజ్జన్న కుమారుడు లోకేష్ వరుణ్ చేపలు పడుతుండడం గమనించిన అదే గ్రామానికి చెందిన గండికోట వెంకన్న, పండు అతన్ని గ్రామంలోకి తీసుకొచ్చి గొలుసుతో కట్టేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వారి ఇంటికి వెళ్లి ప్రాధేయపడినా వదలలేదు. లోకేష్ తాత, మావయ్య విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లడంతో వారు మందలించారు. అప్పుడు బాలుడ్ని విడిచి పెట్టినట్లు తెలిసింది. లోకేష్ తండ్రి సాక్షితో మాట్లాడుతూ సుమారు 3 గంటల పాటు తన కొడుకుని కట్టేశారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
కొనుగోలుకు ఇబ్బంది ఏంటి?
తాము పండించిన పెసలు, మినుములు కొనుగోలు చేయడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటి.? పంటను ఇంట్లో ఉంచండి.. కొంటాం అంటున్నారు. రేపు మాపు అంటూ గడిపేస్తున్నారు. స్పష్టమైన ప్రకటన చేయాలి.
– మాగంటి రాజు, రైతు, దెందులూరు
సర్వే పేరిట తాత్సారం
ప్రభుత్వ విధానంపై నమ్మకం లేదు. అనేక మంది రైతులు నష్టానికి అమ్ముకుంటున్నారు. రైతులు కన్నీరు పెడితే ప్రభుత్వానికి మంచిదా.. ఆలస్యం లేకుండా కొంంటే నష్టానికి అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు.
– కొలుసు గణపతిరావు, రైతు, సొసైటీ మాజీ చైర్మన్
ఇమామ్, మౌజన్‌లు ధ్రువపత్రాలు సమర్పించాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని మసీదుల్లో ఇమామత్ నిర్వహిస్తూ ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం అందుకుంటున్న ఇమామ్‌లు, మౌజన్‌లు, వారితో పాటు ప్రస్తుతం ఉన్న ముతవల్లి లేదా మసీదు అధ్యక్షులు వారి ఆధార్ జిరాక్స్ కాపీలు 2, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు 2, మసీదు పేరుపై ఉన్న బ్యాంక్ ఖాతా జిరాక్స్ కాపీలు తమ కార్యాలయంలో సమర్పించాలని జిల్లా వక్ఫ్‌బోర్డ్ ఇన్స్‌పెక్టర్ కేఎండీ అలీం ఒక ప్రకటనలో తెలిపారు.
బోనస్ బకాయిలు ఇవ్వాలి
ఏలూరు (టూటౌన్): వన సంరక్షణ సమితిల్లో పనిచేస్తున్న కూలీలకు వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని వ్యవసాయ కార్మిక సంఘం బృందం తెలిపింది. శనివారం అటవీ శాఖ జిల్లా అధికారి శుభమ్‌కు వినతిపత్రం అందజేశారు. సంఘం ఉపాధ్యక్షులు ఏ.రవి, జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మాట్లాడుతూ కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గిరిజనులు సేకరించే తునికాకు నేటికి బోనస్ బకాయిలు రూ.5 కోట్ల వరకూ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనులు, పేదల పట్ల ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. మెట్ట ప్రాంతంలో దళితులు, గిరిజనులు ఇతర పేదలకు రావాల్సిన వేతన బకాయిలు అందక అవస్థలు పడుతున్నారని అన్నారు.
మురికి కూపంలా ఏలూరు
బాలుడిని గొలుసులతో కట్టేసిన వైనం
చంద్రబాబు పర్యటనలో అడుగడుగునా నిర్బంధం
పశువధ బాధితుల హౌస్ అరెస్ట్
స్థానికులను ఇళ్ల నుంచి బయటకు రానివ్వని పోలీసులు
బంధువు కడసారి చూపుకోసం దగ్గరుండి తీసుకువెళ్లిన పోలీసులు

ఇంటింటికీ పోలీసుల కాపలా

ఇంటింటికీ పోలీసుల కాపలా

ఇంటింటికీ పోలీసుల కాపలా

ఇంటింటికీ పోలీసుల కాపలా

ఇంటింటికీ పోలీసుల కాపలా

ఇంటింటికీ పోలీసుల కాపలా

ఇంటింటికీ పోలీసుల కాపలా

ఇంటింటికీ పోలీసుల కాపలా

ఇంటింటికీ పోలీసుల కాపలా