కాళోజీ సెంటర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరును ముఖ గుర్తింపు విధానం (ఎఫ్ఆర్ఎస్) ద్వారా నమోదు చేస్తున్నారు. ఈనెల 25 వరకు రాష్ట్రవ్యాప్త హాజరు వివరాల ప్రకారం జిల్లాలో 74.07 శాతం విద్యార్థుల హాజరు నమోదైంది. జిల్లాలో మొత్తం 578 పాఠశాలలు ఉండగా 31,857 మంది విద్యార్థులు ఎఫ్‌ఆర్‌ఎస్‌లో నమోదయ్యారు. వీరిలో 23,598 మంది విద్యార్థులు పాఠశాలలకు హాజరుకాగా, 8,259 మంది గైర్హాజరయ్యారు. దీంతో జిల్లా హాజరు శాతం 74.07గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సగటు హాజరు 71.42 శాతంగా ఉండగా, జిల్లా సగటు కంటే 2.65 శాతం అధికంగా హాజరు సాధించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల హాజరు గణాంకాల్లో ఖమ్మం జిల్లా 82.75 శాతంతో మొదటి స్థానంలో ఉండగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా 63.41 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. వరంగల్ జిల్లా 10వ స్థానంలో ఉండగా, హనుమకొండ జిల్లా 73.36 శాతం హాజరుతో 12వ స్థానంలో ఉంది.
విద్యార్థుల క్రమబద్ధమైన హాజరు విద్యా ప్రమాణాల మెరుగుదలకు కీలకం. గైర్హాజరయ్యే విద్యార్థుల వివరాలను గుర్తించి వారి తల్లిదండ్రులతో సంప్రదింపులు జరిపి పాఠశాలలకు వచ్చేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యార్దులు పాఠశాలకు హాజరయ్యేలా ఎంఈఓలు, హెచ్ఎంలు, ఉపాద్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలి. నిరంతరం పర్యవేక్షణ చేస్తాం..
– ఎన్.ప్రశాంత్‌రెడ్డి, డీఈఓ
ప్రభుత్వ పాఠశాలల్లో
విద్యార్థుల హాజరు నమోదు
రాష్ట్రంలో జిల్లాకు పదో స్థానం


