కేయూ స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం | - | Sakshi
Sakshi News home page

కేయూ స్నాతకోత్సవానికి సర్వం సిద్ధం

Nov 27 2026 1:02 AM | Updated on Nov 27 2026 1:02 AM

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలో 24వ స్నాతకోత్సవం రేపు (శనివారం) క్యాంపస్‌లోని ఆడిటోరియంలో నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు వీసీ కె.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. గురువారం యూనివర్సిటీలోని పరిపాలనాభవనం సెనెట్‌హాల్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన స్నాతకోత్సవ వివరాలు వెల్లడించారు. యూనివర్సిటీలోని ఆర్ట్స్‌, సోషల్‌ సైన్సెస్‌, కామర్స్‌అండ్‌బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఎడ్యుకేషన్‌, లా, ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, ఫార్మసీ, సైన్సెస్‌ విభాగాల్లో 2021–2022,2022–2023, 2023–2024, 2024–2025 విద్యాసంవత్సరాల్లోని అభ్యర్థులు 290 మందికి 408 బంగారు పతకాలు ప్రదానం చేస్తారని తెలిపారు. మొత్తం 91మంది అభ్యర్థులకు ఆయా విభాగాల్లో పీహెచ్‌డీ పట్టాలను రాష్ట్ర గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా తన చేతులమీదుగా అందజేయనున్నారన్నారు. ముఖ్యఅతిథిగా సైయంట్‌ సంస్థ వ్యవస్థాపకుడు, పద్మశ్రీ డాక్టర్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. స్నాతకోత్సవ నిర్వహణకు 151 మంది సభ్యులతో 12 కమిటీలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అందులో స్టీరింగ్‌ కమిటీ, రిసెప్షన్‌ కమిటీలతోపాటు వివిధ బాధ్యతలను నిర్వర్తించేలా కమిటీలున్నాయన్నారు. బంగారు పతకాలు, పట్టాలు అందుకునే అభ్యర్థులతో పాటు ప్రతీ అభ్యర్థి వెంట ఒకరికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. అధికారులు, అధ్యాపకులు, ఉద్యోగులు, అభ్యర్థులు తెల్లటి దుస్తులు ధరించి రావాల్సింటుందన్నారు. ఆహ్వానితులు, అధికారులు, సిబ్బంది నిర్దేశించిన ప్రొటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని సూచించారు. రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం, ఓఎస్‌డీ బి.వెంకట్రామ్‌రెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌ పాల్గొన్నారు.

91 మందికి పీహెచ్‌డీ పట్టాలు,

290 మందికి 408 బంగారుపతకాలు

పట్టాలు పంపిణీ చేయనున్న

గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

తెల్లటి దుస్తులు ధరించి రావాలి..

వీసీ ప్రొఫెసర్‌ ప్రతాప్‌రెడ్డి వెల్లడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement