ఖిలా వరంగల్: చారిత్రాత్మక ప్రదేశం కాకతీయ రా జధానిలో అనేక అద్భుతమైన కట్టడాలు, నిర్మాణా లు భూగర్భంలోనే దాగి ఉన్నాయని, ప్రజలు సహకరిస్తే వాటిని వెలికితీసి టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దుతామని కలెక్టర్ సత్యశారద తెలిపారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ సత్యశారదను ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నాగపూరి సంజయ్‌బాబు, ప్రధాన కార్యదర్శి మేడిది మధుసూదన్, కోశాధికారి మండ వెంకన్న, ఉపాధ్యక్షుడు గోనె రాంప్రసాద్ ఆదివారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ద సరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, కాకతీ యుల కట్టడాలను పరిరక్షించాలని వారు కోరు తూ జ్ఞాపికతోపాటు వినతిపత్రం అందజేశారు. అనంతరం, కలెక్టర్ మాట్లాడుతూ ఉర్సు రంగలీల మైదా నంలో జరగనున్న సద్దుల బతుకమ్మ, దసరా వేడుకలను మైసూర్ ఉత్సవాలను తలదన్నేలా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. వెలిదేశి శివమూర్తి, రంజిత్, వెంకటేశ్వర్లు, అఖిల్‌గౌడ్, అజయ్, సంజీవ్, అశోక్, మహేష్, గోవర్ధన్, శ్రీను, సంతోష్, రాజు, రాజశేఖర్, రమేష్, మనోహర్ పాల్గొన్నారు.
ప్రజలు సహకరిస్తే చరిత్రను
వెలికితీస్తాం
సద్దుల బతుకమ్మ, దసరా
ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం
కలెక్టర్ సత్యశారద


