బీఎల్‌ఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

బీఎల్‌ఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలి

Jul 30 2026 5:24 AM | Updated on Jul 30 2026 5:24 AM

రాయపర్తి: అర్హులైన ప్రతీ ఓటరు పేరు జాబితాలో ఉండేలా బీఎల్‌ఏలు బాధ్యతాయుతంగా పనిచేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి సూచించారు. బుధవారం రాయపర్తి మండలంలోని గ్రామాల్లోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, బీఎల్‌ఏలతో పాలకుర్తి మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఎల్‌ఏల పనితీరు ఓటరు జాబితా నిర్వహణ, క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలు, పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేశారు. ప్రజలతో మమేకమై నిరంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలను వారికి వివరించాలన్నారు. పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేయడంలో బీఎల్‌ఏల పాత్ర కీలకమన్నారు. ప్రతీ కార్యకర్త సమన్వయంతో పని చేసి పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు హామ్యానాయక్‌, మండల నాయకులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

పురావస్తు శాఖ భూములకు

రక్షణ చర్యలు

న్యూశాయంపేట: జిల్లాలోని పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) ఆదీనంలోని భూములను డిమార్కేషన్‌ చేసి వాటి రక్షణకు అవసరమైన మ్యాపింగ్‌ సిద్ధం చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో భారత పురావస్తు సర్వే అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలని సూచించారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యం

కాళోజీ సెంటర్‌: గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ సెర్ప్‌, కేంద్ర రూరల్‌ డెవలప్‌మెంట్‌ మంత్రిత్వ శాఖ సంయుక్తంగా ఇంక్యుబెటర్‌ ప్రోగ్రాంను చేపట్టినట్లు అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఇంక్యుబేటర్‌ ప్రోగ్రాం వర్క్‌ షాప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా తయారీ, సేవా రంగాల్లో రాణిస్తున్న 300 మంది గ్రామీణ మహిళా వ్యాపారాలను ఎంపిక చేసి వీరికి ఛాలెంజ్‌ ఫండ్‌ ద్వారా ఆర్థిక సాయంతో పాటు బిజినెస్‌ ప్లానింగ్‌, సాంకేతిక శిక్షణ, ప్యాకేజింగ్‌, బ్రాండింగ్‌, డిజిటల్‌ రిటైల్‌ మార్కెటింగ్‌పై తోడ్పాటు అందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా మహిళా వ్యాపారా ల ఆదాయంలో కనీసం 15 శాతం వృద్ధి సాధించడ మే కాకుండా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడ మే ప్రఽ దాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డీ ఆర్‌డీఓ పీడీ నాగపద్మజ, డీఆర్‌డీఓ అదనపు పీడీ శ్రీనివాస్‌, టి హబ్‌ ప్రతినిధి మణికంఠ, నాబార్డ్‌ డీడీఎం, ఎల్‌డీఎం, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.

విద్యార్థుల భద్రతకు

పాఠశాల మార్పు

కాశిబుగ్గ: దేశాయిపేటలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని కలెక్టర్‌ సత్యశారద ఆదేశాల మేరకు వేరే పాఠశాలకు మార్చినట్లు డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. విద్యార్థుల వసతి, భద్రత దృష్ట్యా కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్థానికంగా ఖాళీగా ఉన్న ఎయిడెడ్‌ నెహ్రూ మెమోరియల్‌ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించి బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ మండల విద్యాధికారి వెంకటేశ్వర్‌రావు, మాజీ కార్పొరేటర్‌ బస్వరాజు కుమారస్వామి, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్‌ పద్మ, నెహ్రూ మెమోరియల్‌ స్కూల్‌ కరస్పాండెంట్‌ వేద ప్రకాశ్‌, ట్రస్ట్‌ సభ్యులు పూతల మధు, పూర్వ విద్యార్థులు అశోక్‌, సూర్య ప్రకాశ్‌, పాలడుగుల సురేందర్‌, హెడ్‌మాస్టర్లు భూముల రాజేష్‌, ఉషారాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement