న్యూస్‌రీల్
గురువారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 202
1న నర్సంపేటలో జాబ్ మేళా
7
కాళోజీ సెంటర్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో డెవెలప్‌మెంట్ మేనేజర్, టైపి స్ట్, ఆఫీస్ సబార్డినేట్స్, విలేజ్ లైఫ్ మిత్రా పోస్టుల ఎంపికకు ఆగస్టు 1న (శనివారం) నర్సంపేటలోని మండల సమాఖ్య కార్యాలయంలో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బి.సాత్విక బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డెవలప్‌మెంట్ మేనేజర్, టైపిస్ట్ పోస్టులకు డిగ్రీ, ఆఫీస్ సబార్డినేట్, విలేజ్ లైఫ్ మిత్ర పోస్టులకు 10వ తరగతి పాసైన వారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్, పాన్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లు, బయోడేటా, అడ్రస్ ప్రూఫ్, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు.


