న్యూశాయంపేట: జిల్లాలో వివిధ ప్రతిష్టాత్మక అభివృద్ధి ప్రాజెక్టుల కోసం భూసేకరణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జే.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం కోనయమాకుల ఎత్తిపోతల పథకం, కాకతీయ టెక్స్‌టైల్ పార్క్, ఇన్నర్ రింగ్ రోడ్, జాతీయ రహదారి–163జీ, రైల్వే ప్రాజెక్టులు, విమానాశ్రయానికి సంబంధించిన భూ సేకరణ పనుల పురోగతిని శాఖల వారీగా సమీక్షించారు. ప్రాజెక్ట్‌ల వారీగా పెండింగ్‌లో ఉన్న భూసేకరణ, పరిహారం, చెల్లింపులు, అవార్డు ప్రక్రియ, భూ స్వాధీనం తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. భూ సేకరణ ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమా, ఉమారాణి, ఏడీ సర్వే ల్యాండ్స్ శ్రీనివాస్‌రావు, జోనల్ మేనేజర్ స్వామి, ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈ ఆనందం, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
గడువులోగా ఎస్‌ఐఆర్
ప్రక్రియ పూర్తి చేయాలి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు జాబితా సవరణ) కార్యక్రమ పురోగతిపై హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియను పూర్తిచేయాలన్నారు. జిల్లా నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద, అదనపు కలెక్టర్‌లు సంధ్యారాణి, వైవీ గణేశ్, ఆర్డీఓలు సుమా, ఉమారాణి, అధికారులు పాల్గొన్నారు.
ఎరువుల పరీక్ష కేంద్రం
ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి
హన్మకొండ: రాష్ట్రంలో రాజేంద్రనగర్ తర్వాత వరంగల్‌లో ఏర్పాటు చేసిన రెండో ఎరువుల పరీక్ష కేంద్రం (ఎఫ్‌సీఓ ల్యాబ్) నూతన భవనాన్ని ప్రారంభోత్సవానికి అన్ని విధాలుగా సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం వరంగల్ పైడిపల్లిలోని రైతు శిక్షణ కేంద్రం ఆవరణలో నూతనంగా నిర్మించిన ఎరువుల పరీక్ష కేంద్ర భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రయోగశాల గదులు, విద్యుత్, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం తదితర మౌలిక వసతులను పరిశీలించి, నిర్మాణంలో ఉన్న లోపాలను గుర్తించారు. భవనంలో అవసరమైన మార్పులు, చేర్పులు వెంటనే పూర్తి చేసి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రారంభోత్సవానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా భవనాన్ని సిద్ధం చేయాలని సూచించారు. భవన నిర్మాణ పనులపై సమగ్ర నివేదికను సమర్పించాలని పంచాయతీరాజ్ శాఖ డివిజనల్ ఇంజనీర్‌ను ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి శ్రీనివాస్ రావు, డీఏఓ విజయభాస్కర్ పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద


