ఉత్తములను గౌరవించుకుందాం | - | Sakshi
Sakshi News home page

ఉత్తములను గౌరవించుకుందాం

Jul 30 2026 5:24 AM | Updated on Jul 30 2026 5:24 AM

కాళోజీ సెంటర్‌: సెప్టెంబర్‌ 5న నిర్వహించే ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి భావంతులైన ఉపాధ్యాయులను గౌరవించేందుకు పాఠశాల విద్యాశాఖ శ్రీకారం చుట్టింది. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని అందజేసే ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు–2026’ కోసం తగిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా విద్యాశాఖ సంచాలకులు డాక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారి బి.రంగయ్యనాయుడు స్పష్టమైన మార్గదర్శకాలను వెల్లడించారు.

ఆగస్టు 14న జిల్లా స్థాయి

సెలెక్షన్‌ కమిటీ ప్రతిపాదనలు..

ఆగస్టు 14న జిల్లా స్థాయి సెలెక్షన్‌ కమిటీ ప్రతిపాదనలు సమర్పించాలి. ఆగస్టు 15 నుంచి 24వ తేదీ వరకు హైదరాబాద్‌లోని మాసబ్‌ ట్యాంక్‌ ఐఏఎస్‌ ఈ ప్రిన్సిపాల్‌ ఆధ్వర్యంలో ప్రతిపాదనల పరిశీలన. ఆగస్టు 29న తుది జాబితాను విద్యాశాఖ డైరెక్టర్‌కు సమర్పించనుట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

అర్హులు ఎవరు?

ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలతో పాటు ఎయిడెడ్‌, మోడల్‌ స్కూళ్లు, కేజీబీవీలు, టీజీఆర్‌ఈఐఎస్‌ గురుకులాలు, ఐఏఎస్‌ఈ, సీటీఈ, డైట్‌ సంస్థల్లో పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ఫ్యాకల్టీలు ఈ పురస్కారాలకు అర్హులు. హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లకు కనీసం 15 సంవత్సరాలు, ఉపాధ్యాయులకు 10 సంవత్సరాల అనుభవం ఉండాలని పేర్కొన్నారు.

ఎంపిక ఇలా..

రెండు విద్యాసంవత్సరాల్లో సాధించిన ప్రగతి ఆధారంగానే ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపు, బడి మానేసే వారి శాతం తగ్గించడం, టెన్త్‌ వార్షిక పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత, గరిష్ఠంగా 9+ జీపీఏ ఫలితాలు సాధించడం, సైన్స్‌ ఫెయిర్లు, ఇతర రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విద్యార్థులు సాధించిన పురస్కారాలు, తదితర వాటిని పరిగణలోకి తీసుకుంటారు.

ఉపాధ్యాయ దినోత్సవ పురస్కారాలకు కసరత్తు షురూ

ఆగస్టు 14వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలి

విద్యాశాఖ సంచాలకులు

నవీన్‌ నికోలస్‌ ఆదేశాలు

ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది

సెప్టెంబర్‌ 5న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరి ంచుకుని ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యా య పురస్కారాలు–2026’ కోస ం తగిన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభం అయింది. రాష్ట్రస్థాయిలో ఎంపికై న ఉత్తమ ఉపాధ్యాయులకు సెప్టెంబర్‌ 5 న జరిగే వేడుకల్లో వెండి పతకం (పసిడి పూతతో), శాలువా, రూ.10 వేల నగదు, ప్రశంసా పత్రం అందజేసి ఘనంగా సత్కరిస్తారు.

–బి.రంగయ్య నాయుడు, డీఈఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement