● పూజల్లో పాల్గొన్న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి దంపతులు
పరకాల: వరుణ దేవుడి కరుణతో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలంతా సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. కుంకుమేశ్వరస్వామి దేవస్థానంలో హిరణ్య ఋష్య శృంగావాహన వరుణయాగ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి దంపతులు యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పూజ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ వెంకన్న, మున్సిపల్ కమిషనర్ పి.పవన్, శ్రీకుంకుమేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ కొలుగూరి రాజేశ్వర్‌రావు, ఆలయ ధర్మకర్తలు, అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


