‘హైడ్రా’ను తెచ్చేందుకు సిద్ధమా? | - | Sakshi
Sakshi News home page

‘హైడ్రా’ను తెచ్చేందుకు సిద్ధమా?

Jun 22 2026 1:06 AM | Updated on Jun 22 2026 1:06 AM

‘హైడ్రా’ను తెచ్చేందుకు సిద్ధమా?

పశ్చిమ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

హన్మకొండ చౌరస్తా: ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా వంటి సంస్థను వరంగల్‌కు తీసుకొచ్చేందుకు సిద్ధమా అని ప్రతిపక్షాలకు వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం నగరంలో వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను నిర్వీర్యం చేసిందని, కార్పొరేషన్‌ స్థలాన్ని కబ్జా చేసి బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం నిర్మించిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. సీఎంగా నగరానికి వచ్చిన కేసీఆర్‌ అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మిస్తామని చెప్పి రూపాయి ఇవ్వలేదని, ముంపు బాధితులకు రూ.10వేలు ఇస్తానని కేటీఆర్‌ జాడలేకుండా పోయాడని అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వమే నగరంలో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ నిర్మాణానికి డీపీఆర్‌ రూపొందించామని వెల్లడించారు. కేటీఆర్‌ మళ్లీ ఏ ముఖం పెట్టుకుని వరంగల్‌కు వస్తున్నాడని, హామీలను విస్మరించినందుకు కేటీఆర్‌ ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే బట్టలు ఊడదీసి ఉరికియ్యాలని అన్నారు. వరంగల్‌ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మళ్లీ ఎమ్మెల్యేగా గెలుస్తానని కలలు కంటున్నాడు, కనీసం కార్పొరేటర్‌గా కూడా గెలవడని ఎద్దేవా చేశారు. ఇటీవల హనుమకొండ వచ్చిన హరీశ్‌రావు.. గంజాయి స్మగ్లర్‌ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. మామునూరు ఎయిర్‌పోర్టుకు భూసేకరణ చేసిన ఏకై క జిల్లా వరంగల్‌ అన్నారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు ఈవీ శ్రీనివాసరావు, బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ ఎండీ అజీజ్‌ఖాన్‌, మాజీ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు, విజయశ్రీ, శ్రీమాన్‌ తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement