● వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
వర్ధన్నపేట: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మహిళా సంఘాలను నిర్వీర్యం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాలకు పెద్దపీట వేసినట్లు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. శ్రీరామోజీ కుమ్మరిగూడెంలో రూ.10 లక్షలతో ఇందిర భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు భూమి పూజ చేసి మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహిళలకు మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కొండా సురేఖ, సీతక్కకు మంత్రి పదవులు ఇచ్చి మహిళల గౌరవాన్ని కాపాడినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ బతుకమ్మ చీరలు ఇస్తే పంట పొలాల్లో పిట్టలు వాలకుండా కట్టుకున్నారని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం అందించిన చీరలు ఎంతో నాణ్యమైనవని చెప్పారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. రేకుల షెడ్డు నిర్మాణానికి తన వేతనం నుంచి రూ.10 వేలు సర్పంచ్ భూక్యా సుశీలకు అందించారు. స్కూల్ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బావనికుంట తండాలో విద్యుదాఘాతంతో మృతిచెందిన నూనావత్ గణేశ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గణేశ్ మృతదేహానికి పూలమాల వేసి ఎమ్మెల్యే నివాళులర్పించారు. వర్ధన్నపేట ఏఎంసీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, పీఎసీఎస్ చైర్మన్ కౌడగాని రాజేశ్‌కన్నా, ఐనవోలు ఆలయ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్‌గౌడ్, నాయకులు పోషాల వెంకన్న, భూక్యా చిన్న శంకర్, ఉప్పునూతుల దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.


