విద్యారణ్యపురి: హనుమకొండలోని పింగిళి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల డిగ్రీ కోర్సుల బీఏ, బీకాం, బీఎస్సీ తదితర కోర్సుల రెండు, నాలుగో, ఆరో సెమిస్టర్ పరీక్షల ఫలితాలను శనివారం కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం, ఆకళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళితో కలిసి విడుదల చేశారు. రెండో సెమిస్టర్ పరీక్షలకు 648 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 511 మంది ఉత్తీర్ణత (79శాతం) సాధించారు. నాలుగో సెమిస్టర్‌లో 71 మందికి గాను 346 మంది ఉత్తీర్ణత (74శాతం) సాధించారు. ఆరో సెమిస్టర్‌లో 425 మందికి 397 మంది (93 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు ఆకళాశాల ప్రిన్సిపాల్ చంద్రమౌళి తెలిపారు. ఈఫలితాల విడుదలలో పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ జి.సుహాసిని, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారులు కొలిపాక శ్రీనివాస్, రాజిరెడ్డి, విభాగాల అధిపతులు సురేశ్‌బాబు, రామకృష్ణారెడ్డి, రేణుక, మాధవి, మధు, కవిత, ప్రవీణ్‌కుమార్, బాలరాజు, లకన్‌సింగ్, సునీత, మమత, లక్ష్మీకాంతం, రమారత్నమాల, సునీత, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


