ఖిలా వరంగల్: వరంగల్ స్టేషన్ రోడ్డులోని ఆరు విత్తన షాపుల్లో టాస్క్‌ఫోర్స్ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. లైసెన్స్, స్టాక్ రిజిస్టర్, సెల్స్ రిజిస్టర్, బిల్లు బుక్కును పరిశీలించారు. రైతులకు జారీ చేసిన బిల్లులపై ఆరా తీశారు. షాపులోని నిల్వలకు స్టాక్ రిజిస్టర్‌లో నమోదైన నిల్వలను పోల్చిచూశారు. తనిఖీల్లో జి.కల్పన ఏడీఏ టెక్నికల్, జి.నర్సింగం ఏడీఏ వర్ధన్నపేట, గోవర్ధన్ రెడ్డి ఏఓ ఎస్‌టీఎల్, పి.రమేష్ ఎస్సై మిల్స్‌కాలనీ, స్థానిక వ్యవసాయాధికారి రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.


