ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయం | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయం

Jun 19 2026 2:12 AM | Updated on Jun 19 2026 2:12 AM

అదనపు కలెక్టర్‌ వైవీ గణేష్‌

వర్ధన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ, వారి అభ్యున్నతికి కృషి చేస్తున్న ఉపాధ్యాయుల సేవలు ప్రశంసనీయమని అదనపు కలెక్టర్‌ వైవీ గణేష్‌ కొనియాడారు. మండలంలోని ల్యాబర్తి జెడ్పీహెచ్‌ఎస్‌లో బడిబాట బ్రోచర్లు, స్టూడెంట్‌ డైరీలను డీఈఓ రంగయ్యనాయుడుతో కలిసి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణేష్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు పెంపే లక్ష్యంగా, ప్రైవేట్‌ పాఠశాలలకు ఏ మాత్రం తీసిపోనివిధంగా ఉపాధ్యాయుడు సోమవరపు యుగేందర్‌ తన సొంత ఖర్చుతో ఆకర్శనీయమైన బడిబాట బ్రోచర్లను ఆవిష్కరించారని అన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణను పెంపొందించేందుకు, సమయపాలనకు తక్కళ్లపెల్లి బుచ్చిబాబు సమకూర్చిన స్టూడెంట్‌ డైరీలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. అనంతరం, యుగంధర్‌, బుచ్చిబాబును సన్మానించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం లింగం శైలజ, ఉపాధ్యాయులు వేణుకుమార్‌, రఘువీర్‌, హరిలాల్‌, నాగరాజు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement