శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శుక్రవారం శ్రీ 19 శ్రీ జూన్‌ శ్రీ 2026

Jun 19 2026 2:12 AM | Updated on Jun 19 2026 2:12 AM

–8లోu

న్యూస్‌రీల్‌

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

జూన్‌ మాసం ముగిసిపోతోంది. కాలం నెత్తిమీదకు వచ్చింది. అయినా వరుణుడు కరుణించడం లేదు. ఫలితంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా రైతాంగం ఆకాశం వైపు ఆశగా చూస్తోంది. గత ఖరీఫ్‌ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండకపోవడంతో సాగునీటి కొరత ఏర్పడింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ ఉమ్మడి వరంగల్‌ జిల్లాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. జూన్‌ 1 నుంచి 18వ తేదీ (గురువారం) వరకు నమోదైన వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.

70 మండలాల్లో లోటు, భారీ లోటు..

9 మండలాల్లో సాధారణం..

సాధారణంగా జూన్‌ తొలి పక్షంలోనే విస్తృతంగా వర్షాలు కురిసి ఖరీఫ్‌ సాగు ఊపందుకోవాలి. ఈసారి అక్కడక్కడా చిరుజల్లులు మినహా భారీ వర్షాలు నమోదు కాలేదు. ఉమ్మడి వరంగల్‌లో 79 మండలాలకు 43 మండలాల్లో భారీ లోటు (60 శాతం నుంచి 99 శాతం), 27 మండలాల్లో లోటు (20 శాతం నుంచి 59 శాతం), 9 మండలాల్లోనే సాధారణ (19 శాతం అధికం, 19 శాతం మైనస్‌) వర్షపాతం నమోదైంది. దీంతో వానాకాలం సాగు కోసం విత్తనాలు సిద్ధం చేసుకున్న రైతులు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. తగినంత తేమ లేకపోవడంతో విత్తనాలు వేయడానికి ముందుకు రావడం లేదు. వర్షాల లేమితో వ్యవసాయ పనులు మందగిస్తున్నాయి. సాధారణంగా ఈ సమయానికి పత్తి, మొక్కజొన్న, కంది సాగు ప్రారంభం కావాల్సి ఉన్నా అనేక ప్రాంతాల్లో రైతులు వేచి చూస్తున్నారు. మరో వారం రోజులపాటు గణనీయమైన వర్షాలు లేకుంటే ఖరీఫ్‌ సాగు విస్తీర్ణంపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.

ఉమ్మడి వరంగల్‌లో ఇదీ పరిస్థితి..

ఆరు జిల్లాల్లో తొమ్మిది మండలాలు మినహా అంతటా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. హనుమకొండ జిల్లాలో మొత్తం 14 మండలాల్లో ఇప్పటికీ వర్షపాతం భారీ లోటుగా ఉంది. 77.1 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా 15.6 మి.మీ.లే నమోదు కాగా 80శాతం లోటుగా ఉంది. వరంగల్‌ జిల్లాలో 13 మండలాలకు ఏడు మండలాల్లో లోటు, ఐదు మండలాల్లో భారీ లోటు ఉండగా, రాయపర్తి మండలంలో 74.2 మి.మీ.లకు 60.1 (19 శాతం) మి.మీ.లతో సాధారణంగా నమోదైంది. జేఎస్‌ భూపాలపల్లిలో 12 మండలాలకు మహాముత్తారం, కాటారం, ములుగు గణపురంలలో సాధారణ వర్షం కురవగా, నాలుగు మండలాల్లో లోటు, 5 మండలాల్లో భారీ లోటు ఉంది. జనగామలో జనగామ, దేవరుప్పులలో నార్మల్‌ కాగా, 10 మండలాల్లో వర్షం లోటు, భారీ లోటు ఉండగా, మహబూబాబాద్‌లో 18 మండలాలకు పెద్దవంగరలో సాధారణం నమోదు కాగా, నాలుగు మండలాల్లో లోటు, 13 మండలాల్లో వర్షపాతం భారీ లోటుగా ఉంది. ములుగు జిల్లాలో వెంకటాపూర్‌, కన్నాయిగూడెంలో సాధారణం నమోదు కాగా, ములుగు, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, వాజేడు, మంగపేట, జేడీ మల్లంపల్లిలో లోటు, వెంకటాపురం(కె)లో భారీ లోటు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది.

34%

హనుమకొండ

భూపాలపల్లి

జనగామ

వరంగల్‌

మహబూబాబాద్‌

ములుగు

జూన్‌ ముగుస్తున్నా ఉమ్మడి జిల్లా

అంతటా లోటు వర్షపాతం

గతేడాది నిరాశపరిచిన వానలు.. ఈసారి కూడా అదే పరిస్థితా?

9 మండలాల్లోనే సాధారణం,

70 మండలాల్లో లోటు

ఖరీఫ్‌ సాగు పనుల్లో జాప్యం..

రైతుల్లో పెరుగుతున్న ఆందోళన

ఆకాశం వైపు ఆశగా చూపులు..

జిల్లాల వారీగా వర్షపాతం పరిస్థితి (మి.మీ.లలో) (జూన్‌ 1–18 వరకు)

94.7

84.3

79.6

81.0

77.1

70.7

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement