అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీల్లో శ్రీరామ్‌ సత్తా | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీల్లో శ్రీరామ్‌ సత్తా

Jun 18 2026 1:35 AM | Updated on Jun 18 2026 1:35 AM

అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీల్లో శ్రీరామ్‌ సత్తా

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో ఇంటర్నేషనల్‌ హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ హ్యాండ్‌బాల్‌ టోర్నీలో వరంగల్‌ యువకుడు కీలక భూమిక పోషించాడు. ఈ టోర్నమెంట్‌లో భారత్‌ బంగారు పతకం సాధించింది. భారత జట్టుకు వరంగల్‌ నగరంలోని కొత్తవాడకు చెందిన కొడకండ్ల శ్రీరామ్‌ ప్రాతినిథ్యం వహిస్తూ పీవోట్‌ ప్లేయర్‌గా అద్భుత ప్రతిభతో అందరి చూపును తనవైపు తిప్పుకున్నాడు. జిల్లాకు చేరుకున్న శ్రీరామ్‌, డీవైఎస్‌ఓ కొత్త ప్రశాంత్‌, కోచ్‌ బొడ్డు విష్ణువర్ధన్‌లతో కలిసి బుధవారం హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ని కలిశారు. ఈసందర్భంగా కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌ యువక్రీడాకారుడు శ్రీరామ్‌ను అభినందించారు. అంతర్జాతీయ వేదికపై అద్భుత ప్రతిభ కనబర్చి దేశానికి గర్వకారణంగా నిలవడంపై హర్షం వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీరామ్‌ ఇప్పటి వరకు 20 రాష్ట్ర స్థాయి, 12 జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో పాల్గొని ఎన్నో విజయాలు సాధించినట్లు కోచ్‌ విష్ణువర్ధన్‌ తెలిపారు. భారత్‌కు గోల్డ్‌ మెడల్‌ తీసుకురావడంతో శ్రీరామ్‌ ప్రత్యేక కృషిగా చెప్పుకోవడం కోచ్‌గా తాను గర్విస్తున్నానని అన్నారు.

క్రీడాకారుడిని అభినందించిన

కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌

కొత్తవాడలో శ్రీరామ్‌కు ఘన స్వాగతం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement