జెడ్పీ సీఈఓ శేషాద్రి
దామెర: గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమని జెడ్పీ సీఈఓ శేషాద్రి అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం వార్డు సభ్యుల శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధిఽకి సర్పంచ్‌లు, వార్డు సభ్యులు సమష్టి సహకారంతో ముందుకు సాగాలన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గుమ్మడి కల్పన, ఎంపీఓ ఎంవీ.రంగాచారి, దామెర సర్పంచ్ గరిగె కల్పనకృష్ణమూర్తి, ఉపసర్పంచ్ బత్తిని రాజు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నడికూడలో..
నడికూడ: మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రెండో రోజు వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శేషాద్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండేది వార్డు సభ్యులేనని, ప్రతీ వార్డు సభ్యుడు తమ విధులు, బాధ్యతలను తెలుసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రామకృష్ణ, ఎంపీఓ మార్గవిరెడ్డి, వార్డు సభ్యులు, కార్యదర్శులు పాల్గొన్నారు.


