నర్సంపేట: పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ విద్యుత్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సీఈ రాజ్‌చౌహాన్ సూచించారు. ఈ మేరకు నర్సంపేట, ఖానాపురం మండలాల్లో మంగళవారం పర్యటించారు. విద్యుత్ శాఖ పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, విద్యుత్ అంతరాయాల పరిస్థితి, వ్యవసాయ వినియోగదారులకు సంబంధించిన పెండింగ్ పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 11కేవీ ఫీడర్ల డిజిటల్ యాక్షన్ స్టేటస్, ఏజీఎల్ డీటీఆర్‌ల ఆర్పీడీసీఎల్ ఎంట్రీలు, ఓవర్‌లోడ్ డీటీఆర్‌ల పరిస్థితి, ద్వారకపేట సబ్‌స్టేషన్ పనుల పురోగతి, నర్సంపేట డివిజన్ పరిధిలో 11కేవీ అంతరాయాల వివరాలను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డీఈ పి.తిరుపతి, రూరల్ ఏడీఈ రాజేశ్‌రెడ్డి, టౌన్ ఏడీఈ బి.లక్ష్మణ్, ఏఈ ఎన్.విజయ్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
సీఈ రాజ్‌చౌహాన్


