ధర్మసాగర్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రీ–ప్రైమరీ (ఎల్‌కేజీ, యూకేజీ) తరగతులు ప్రవేశపెట్టారని డీఈఓ గిరిరాజ్ గౌడ్ అన్నారు. మండలంలోని పెద్ద పెండ్యాల, ఎల్కుర్తి, తాటికాయలలో సోమవారం పాఠశాలలను ఘనంగా పునఃప్రారంభించారు. ఈసందర్భంగా డీఈఓ గిరిరాజ్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాల్లోని విద్యార్థులంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ఉపాధ్యాయులు, సర్పంచ్, ప్రజలు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఎంఈఓ రాంధన్ మాట్లాడుతూ.. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు శ్రమించి రికార్డు స్థాయిలో విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ తోట నాగరాజు మాట్లాడుతూ గ్రామంలోని పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యతను సర్పంచ్‌గా తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో హెచ్‌ఎం భగవాన్ రెడ్డి, సర్పంచ్ లు నరిశెట్టి సుధాకర్, ననుబాల సోమక్క తదితరులు పాల్గొన్నారు.


