వర్ధన్నపేట: వర్ధన్నపేట పట్టణంలోని అన్నదాత ఆగ్రో సెంటర్‌పై సోమవారం సాయంత్రం టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. పలు కంపెనీలకు చెందిన రూ.6.86,905 విలువైన గడువు ముగిసిన పురుగు మందులు సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. నల్లబెల్లి గ్రామ శివారు రంగాపురానికి చెందిన యజమాని రాపర్తి రాజుపై కేసు నమోదు చేసి స్థానిక ఎస్సై సాయిబాబుకు అప్పగించారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సీఐ పెండ్యాల దేవేందర్, ఎస్సై బి.ఉప్పలయ్య, సిబ్బంది పాల్గొన్నారు.


