హన్మకొండ కల్చరల్: శ్రీభద్రకాళి దేవాలయంలో మూడు రోజులపాటు జరగనున్న ధ్వజస్తంభ ప్రతిష్టామహోత్సవ పూజలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు అమ్మవారి ఆజ్ఞ తీసుకుని అనంతరం పూర్వంగవిధి, యాగశాల ప్రవేశం చేశారు. సర్వతోభద్రమండల రచన, దేవతాహ్వానం, మూలమంత్రనుష్టాన హోమాలు, కుటీర హోమం, జలాధివాసం చేశారు. కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, ఎస్‌ఈ ఇరిగేషన్ హరివెంకటరామ ప్రసాద్, దేవాలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బండారు శివసుబ్రహ్మణ్యమ్ పాల్గొన్నారు.


