మరో మూడు రోజుల్లో ముగియనున్న కార్యక్రమం
పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు అన్ని మౌలిక వసతులను సమకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమం ద్వారా విద్యార్థుల చేరికలు ఎక్కువగా ఉండాలని నిర్దేశించింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు లక్ష్యాన్ని చేరుకోవడంలో వెనుకబడిపోతున్నారు. 2025–26వ సంవత్సరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 32,614 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ ఏడాది బడిబాట కార్యక్రమం ద్వారా 3,513 కొత్త అడ్మిషన్లు తీసుకురావాలని టార్గెట్ విధించినా ఇప్పటివరకు 1,761 మంది విద్యార్థులను మాత్రమే చేర్పించగలిగారు. ఒకటో తరగతి అడ్మిషన్లు 579, రెండు నుంచి ఐదో తరగతి వరకు 337, ఆరు నుంచి పదో తరగతి వరకు 845 అడ్మిషన్లు అయ్యాయి. మే 18న ప్రారంభమైన ఈ బడిబాట కార్యక్రమం ఈ నెల 19తో ముగియనుంది. ఇంకా లక్ష్యాన్ని చేరుకోవాలంటే 1,754 మంది విద్యార్థులను చేర్పించాల్సిన అవసరం ఉంది. మరో మూడు రోజులు మాత్రమే సమ యం ఉంది ఇప్పటివరకు 50.07 శాతం మాత్రమే అడ్మిషన్లు కాగా.. మరో 49.93 శాతం అడ్మిషన్లు కావాల్సి ఉంది. విద్యాశాఖ అధికారులు ఆ దిశగా కృషి చేయాలి.


