సంగెం: వానాకాలంలో నాటడానికి నర్సరీల్లోని మొక్కలను సిద్ధం చేయాలని డీఆర్‌డీఓ నాగపద్మజ అన్నారు. మండలంలోని చింతలపల్లి గ్రామ నర్సరీని గురువారం ఆమె సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ మాట్లాడుతూ గ్రామాలు పచ్చదనంతో కళకళలాడాలంటే నాణ్యమైన మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో నర్సరీల పాత్ర కీలకమని, మొక్కలు నాటడమే కాకుండా సంరక్షించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సతీశ్, పీల్డ్‌అసిస్టెంట్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.


