వేసవి సెలవుల పొడిగింపు | - | Sakshi
Sakshi News home page

వేసవి సెలవుల పొడిగింపు

May 31 2026 1:42 AM | Updated on May 31 2026 1:42 AM

వేసవి సెలవుల పొడిగింపు జీపీఎఫ్‌ ప్రకటన అవాస్తవం ఏసీజీఈగా మధుసూదన్‌రావు.. 8 నుంచి ఎంబీఏ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు

కేయూ క్యాంపస్‌: కేయూ పరిధిలోని డిగ్రీ కళాశాలలకు వేసవి సెలవులను జూన్‌ ఐదో తేదీవరకు పొడిగిస్తూ రిజిస్ట్రార్‌ వి.రామచంద్రం శనివారం సర్క్యూలర్‌ జారీచేశారు. వేసవి సెలవులు ఈనెల 31తో ముగిసి జూన్‌ ఒకటి నుంచి డిగ్రీ కళాశాలలు పునఃప్రారంభించాల్సి ఉంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ జె.చిన్న, ఇతర బాధ్యులు కేయూ రిజిస్ట్రార్‌ రామచంద్రంను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎండల నేపథ్యంలో వేసవి సెలవులు పొడిగించాలని కోరగా.. జూన్‌ 5వ తేదీ వరకు పొడిగించారు. విద్యార్థులు, అధ్యాపకులకు ఈసెలవులు వర్తిస్తాయి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు యథావిధిగానే విధులు నిర్వర్తించాలి. జూన్‌ 6 నుంచి కళాశాలలు రీ ఓపెన్‌ చేస్తారు.

హన్మకొండ చౌరస్తా: మార్చి 2024 నుంచి రిటైర్డ్‌ అయిన రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పెన్షనర్ల బకాయిలను ప్రభుత్వం నిన్న జీపీఎఫ్‌ వందశాతం చెల్లించామని ప్రకటించడం అవాస్తవమని, ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నట్లు రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు కందుకూరి దేవదాసు తెలిపారు. శనివారం హనుమకొండలోని అలంకార్‌ జంక్షన్‌లోని టీఎన్జీఓస్‌ భవన్‌లో టి.రఘువీరు అధ్యక్షతన ఉమ్మడి వరంగల్‌ జిల్లా రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లను మోసం చేస్తోందని, జూన్‌ 2న రాష్ట్రవ్యాప్తంగా తాము నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశం అనంతరం ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని వివిధ జిల్లాలకు ఇన్‌చార్జ్‌ లను నియమించినట్లు తెలిపారు. హనుమకొండకు ఎం.సంజీవరెడ్డి, ఎ.సురేందర్‌, వరంగల్‌కు టి.రఘువీర్‌ను నియమించినట్లు దేవదాసు తెలిపారు. కార్యక్రమంలో ఎ.సురేందర్‌, ఎం.పాపయ్య, పెద్ది ఆంజనేయులు, కామేశ్వర్‌, పి.సాంబయ్య, మీసా రాజమల్లయ్య, డాక్టర్‌ బి.కృష్ణమూర్తి, సాల్మన్‌, ప్రభుదాస్‌, వేణుగోపాల్‌రెడ్డి, భిక్షపతి పాల్గొన్నారు.

భువనేశ్వరి బదిలీ

విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయం అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎగ్జామినేషన్స్‌ (ఏసీజీఈ)గా ఎ.మధుసూదన్‌రావు హైదరాబాద్‌ డీఈఓ కార్యాలయం నుంచి బదిలీపై వస్తున్నారు. ఈమేరకు సంబంధిత విద్యాశాఖ ఉన్నతాధికారులు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఏసీజీఈగా విధులు నిర్వర్తిస్తున్న భువనేశ్వరి ఇక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఎస్సెస్సీ బోర్డులో ఏసీజీగా బదిలీ అయ్యారు. కాగా, మధుసూదన్‌రావు సోమవారం విధుల్లో చేరుతారని సమాచారం.

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఎంబీఏ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు (ఎక్స్‌, ఇంప్రూవ్‌మెంట్‌) జూన్‌ 8నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్‌, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారి డాక్టర్‌ ఆిసీం ఇక్బాల్‌ తెలిపారు. జూన్‌ 8, 10, 12, 15, 17, 19, 20 తేదీల్లో పరీక్షలు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement