పాఠశాల విద్యలో జనగామకు జాతీయ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

పాఠశాల విద్యలో జనగామకు జాతీయ గుర్తింపు

May 31 2026 1:42 AM | Updated on May 31 2026 1:42 AM

జనగామ: కేంద్ర మానవ వనరుల శాఖ విడుదల చేసిన పర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ – పాఠశాల విద్య స్థితి (పీజీఐ–డీ) 2024–25 నివేదికలో జనగామ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానం కై వసం చేసుకుంది. పాఠశాల విద్య పనితీరు సూచికలో 600 మార్కులకు 357 మార్కులు సాధించి ‘ప్రచేష్ట–1’ గ్రేడ్‌తో తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచింది. హనుమకొండ 10వ ర్యాంక్‌ సాధించగా, మిగతా నాలుగు జిల్లాలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. కేంద్రం నిర్దేశించిన ఆరు కేటగిరీల్లో చూపిన ప్రతిభను ప్రామాణికంగా తీసుకున్నారు. ఔట్‌కమ్స్‌, లెర్నింగ్‌ ఔట్‌కమ్స్‌, యాక్సెస్‌, టీచర్‌ అవైలబిలిటీ, ఎఫెక్టివ్‌ క్లాస్‌రూమ్‌ ట్రాన్సాక్షన్‌, లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌, లెర్నింగ్‌ ఎన్‌రిచ్‌మెంట్‌ కార్యకలాపాలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఫెసిలిటీస్‌, స్టూడెంట్‌ ఎంటైటిల్‌మెంట్స్‌ మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు సౌకర్యాల కల్పన, స్కూల్‌ సేఫ్టీ అండ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌, పాఠశాలల్లో భద్రత, బాలల రక్షణ చర్యలు, డిజిటల్‌ లెర్నింగ్‌, డిజిటల్‌ విద్య అమలు, గవర్నెన్స్‌ ప్రాసెస్‌, నిధుల వినియోగం, హాజరు పర్యవేక్షణ, స్కూల్‌ లీడర్‌షిప్‌ విభాగాల్లో ప్రతిభ ఆధారంగా మార్కులు వేశారు. కాగా, జనగామ జిల్లా మొదటిస్థానంలో నిలవడంపై కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, మేధా వులు హర్షం వ్యక్తం చేశారు.

జిల్లాల వారీగా మార్కులు, ర్యాంకులు(రాష్ట్రస్థాయిలో)

జిల్లా మార్కులు ర్యాంక్‌

జనగామ 357 01

హనుమకొండ 306 10

భూపాలపల్లి 295 20

వరంగల్‌ 286 24

ములుగు 266 29

మహబూబాబాద్‌ 259 31

పీజీఐ–డీ 2024–25లో తెలంగాణలో నంబర్‌–1

హనుమకొండకు 10వ ర్యాంకు

అంతగా ప్రభావం చూపని ఉమ్మడి వరంగల్‌లోని మిగతా నాలుగు జిల్లాలు

కేంద్ర మానవ వనరుల శాఖ

నివేదికలో వెల్లడి

Advertisement
 
Advertisement
Advertisement