ఇక.. ఇండోర్‌ సబ్‌స్టేషన్లు | - | Sakshi
Sakshi News home page

ఇక.. ఇండోర్‌ సబ్‌స్టేషన్లు

May 30 2026 8:47 AM | Updated on May 30 2026 8:47 AM

ఇక.. ఇండోర్‌ సబ్‌స్టేషన్లు

పట్టణాలు, నగరాల్లో ఏర్పాటుకు ఎన్పీడీసీఎల్‌ శ్రీకారం

హన్మకొండ: ఇంటికి విద్యుత్‌ కావాలి కానీ, తన ఇంటి ముందు ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టొద్దు.. ఇలా ప్రతి కాలనీలో డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు స్థానికుల నుంచి అధికారులకు ఎదురవుతున్న ఇబ్బందులు. సబ్‌స్టేషన్‌ ఏర్పాటుచేయాలంటే విశాలమైన స్థలం అవసరంనగరాలు, పట్టణాల్లో భూములకున్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. అంత ఖరీదు పెట్టి యాజమాన్యం కొనుగోలు చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో తక్కువ స్థలంలో నిర్మించాలనే ఆలోచనకు వచ్చిన టీజీ ఎన్పీడీసీఎల్‌ యాజమాన్యం, సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి మొదటిసారి ఇండోర్‌ సబ్‌ స్టేషన్లకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలో ఆరు ఇండోర్‌ సబ్‌ స్టేషన్లు నిర్మిస్తుండగా, అందులో గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో రెండు ఉన్నాయి.

స్థలం.. ఖర్చు ఇలా..

● సాధారణంగా ఒక 33/11 కేవి విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి కనీసం ఒక ఎకరం స్థలం అవసరం. కానీ, స్థల సమస్య కారణంగా ఎకరం స్థలం నుంచి 15 గుంటల స్థలానికి చేరుకున్నారు.

● నగరాలు, పట్టణాల్లో 15 గుంటల భూమి లభ్యత సమస్యగా పరిణమించడంతో తక్కువ స్థలం, సమయంలో సబ్‌ స్టేషన్‌ నిర్మించాలనే ఆలోచనలో భాగంగానే ఇండోర్‌ సబ్‌ స్టేషన్లు నిర్మిస్తున్నారు.

● ఇండోర్‌ సబ్‌ స్టేషన్‌కు కనీసం 600 గజాల స్థలం అవసరం కాగా, ఈ స్థలం కూడా లభించకపోవడంతో 400 గజాల్లోనే నిర్మిస్తున్నారు.

● సాధారణ సబ్‌ స్టేషన్‌తో చూసుకుంటే ఇండోర్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణం భారీ ఖర్చుతో కూడుకున్నది.

● సాధారణ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి రూ.2 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల ఖర్చయితే, ఇండోర్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి రూ.6.50 కో ట్ల నుంచి రూ.7 కోట్లు ఖర్చవుతుంది.

● టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధిలో ముందుగా రూ.3,770.43 లక్షల వ్యయంతో ఆరు ఇండోర్‌ సబ్‌ స్టేషన్‌ నిర్మాణానికి పూనుకున్నారు.

టీజీ ఎన్పీడీసీఎల్‌ పరిధి ఆరు చోట్ల.. అందులో గ్రేటర్‌ వరంగల్‌లో రెండు ఏర్పాటు

స్థల సమస్య కారణంగా ఖర్చు ఎక్కువైనా భరించాలని నిర్ణయం

Advertisement
 
Advertisement
Advertisement