‘ప్రీ ప్రైమరీ’కి ప్రయారిటీ ! | - | Sakshi
Sakshi News home page

‘ప్రీ ప్రైమరీ’కి ప్రయారిటీ !

May 30 2026 8:47 AM | Updated on May 30 2026 8:47 AM

‘ప్రీ ప్రైమరీ’కి ప్రయారిటీ !

విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభించేందుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గత విద్యాసంవత్సరంలో ప్రీప్రైమరీ తరగతులకు ఆదరణ లభించడంతో మరిన్ని స్కూళ్లలో ఏర్పాటుకు విద్యాశాఖ ఉపక్రమించింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించుకునేలా గది ఏర్పాటుకు అవకాశం కల్పించారు.

ఒక్కో తరగతికి రూ.లక్ష నిధులు

హనుమకొండ జిల్లాలో 39, వరంగల్‌ జిల్లాలో 48 స్కూళ్లలో ప్రీప్రైమరీ తరగతులు ఏర్పాటు చేయబోతున్నారు. ఒక్కో ప్రీ ప్రైమరీ సెక్షన్‌కు రూ.లక్ష చొప్పున నిధులు కేటాయించారు. చిన్నారులను ఆకర్షించేలా తరగతిగది గోడలపై అక్షరాలు, సంఖ్యలు, వివిధ చిత్రాలు పేయింటింగ్‌ చేయించనున్నారు. ఆటలతో కూడిన విద్యనందించేందుకు ఆటవస్తువులను కూడా అందిస్తారు.

ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకాలు

నూతనంగా ఏర్పాటు చేయనున్న ప్రతీ ప్రైమరీ సెక్షన్‌కు ఒక ఇన్‌స్ట్రక్టర్‌ను ఒక ఆయా చొప్పున నియమిస్తారు. ప్రీప్రైమరీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నారు. అంగన్‌వాడీ స్కూళ్లకు సమీపంలో ఉండేవారికి అదనంగా స్నాక్స్‌ కూడా అందించనున్నారు. ఎస్సీఆర్టీఈ పాఠ్యప్రణాళిక ఆధారంగా వారికి విద్యను అందిస్తారు.

హనుమకొండలో 39, వరంగల్‌లో 48 స్కూళ్లలో సెక్షన్ల ఏర్పాటు

ఒక్కో ప్రీప్రైమరీకి రూ.లక్ష నిధులు

Advertisement
 
Advertisement
Advertisement