● కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్
కమలాపూర్: డబుల్ బెడ్రూం ఇళ్ల సముదాయాల్లో పెండింగ్‌లో ఉన్న పనులన్నింటినీ నెల రోజుల్లో పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. కమలాపూర్, గూడూరు గ్రామాల్లో నిర్మించిన ‘డబుల్’ ఇళ్ల సముదాయాలను, అక్కడి వసతులను శుక్రవారం ఆమె పరిశీలించారు. త్వరగా పంపిణీ చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఉపాధి హామీ పనుల పరిశీలన
మండలంలోని ఉప్పల్‌లో జరుగుతున్న ఉపాధి హామీ పనులు, ఫామ్‌పాండ్‌ను కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ శుక్రవారం పరిశీలించారు. కూలీలతో మాట్లాడి క్షేత్రస్థాయిలో కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. పని ప్రదేశంలో వసతులు, ఓర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచడంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ డీఆర్డీఓ, ఎంపీడీఓ, ఏపీఓలను అభినందించారు.
పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలి..
గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. డంపింగ్ యార్డుల నిర్వహణ పరిశుభ్రంగా, పద్ధతిగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మండలంలోని శనిగరంలో నిర్వహిస్తున్న సెగ్రిగేషన్ షెడ్, డంపింగ్ యార్డును ఆమె పరిశీలించారు. కార్యక్రమాల్లో డీపీఓ లక్ష్మీ రమాకాంత్, పంచాయతీ కార్యదర్శి ప్రవళిక, సర్పంచులు వనజకళాధర్, సతీశ్, రమనాగరాజు, రాజు, హౌసింగ్ పీడీ సిద్ధార్థ నాయక్, డీఆర్డీఓ మేన శ్రీను, ఎంపీడీఓ బాబు, తహసీల్దార్ సురేశ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.


