● వరంగల్ ఎంపీ కడియం కావ్య
దామెర: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియపై ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త అవగాహన కలిగి ఉండాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. మండలంలోని దుర్గంపేట సమీపంలోని ఎన్‌ఎస్‌ఆర్ కన్వెన్షన్ హాల్‌లో శుక్రవారం నియోజకవర్గ స్ధాయి కాంగ్రెస్ బూత్ ఏజెంట్ల శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మూడో దశలో భాగంగా జూన్ 25 నుంచి ఎస్‌ఐఆర్ బృందం పర్యటించి ఓటరు నమోదు, జాబితా సవరణ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఏజెంట్లకు సూచించారు. ఈసీఐ, బీజేపీ కుమ్మకై ఓట్లను తొలగించే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అప్రమత్తంగా ఉండి ఓట్ల తొలగింపును అడ్డుకోవాలని వెల్ల డించారు. సమావేశంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓటర్ల హక్కులు కాపాడడం ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త బాధ్యత అన్నారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ‘కుడా’ చైర్మన్ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.అయూబ్, దామెర, ఆత్మకూరు మండలాల అధ్యక్షులు దుబాసి రాజేందర్, రేవూరి జలందర్ రెడ్డి, నాయకులు సుధాకరరెడ్డి, రాజిరెడ్డి, ప్రకాశ్ రెడ్డి, సర్పంచ్‌లు బొంకూరి రవియాదవ్, పొలెపాక శ్రీనివాస్, దాసి శ్రీకాంత్, నియోజకవర్గం నుంచి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


