పాఠ్యపుస్తకాలొచ్చేశాయ్‌.. | - | Sakshi
Sakshi News home page

పాఠ్యపుస్తకాలొచ్చేశాయ్‌..

May 29 2026 8:04 AM | Updated on May 29 2026 8:04 AM

కాళోజీ సెంటర్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీకి విద్యాశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి జూన్‌ 12న పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికే 100 శాతం పుస్తకాలను విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించారు. జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 10వ తరగతి వరకు మొత్తం 36,839 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్నారు. వీరందరికీ సకాలంలో పుస్తకాలు అందజేయడమే లక్ష్యంగా యంత్రాంగం ముందుకు సాగుతోంది. జిల్లా గౌడౌన్‌కు చేరుకున్న 1,98,430 పుస్తకాలను మొదటి విడత ఆయా మండల కేంద్రాలకు విద్యాశాఖ అధికారులు రవాణా చేస్తున్నారు. ద్విభాషా పుస్తకాల ముద్రణతో

తగ్గనున్న బ్యాగు భారం

ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ‘ద్విభాషా విధానం’ (ఒకవైపు తెలుగు, మరోవైపు ఇంగ్లిష్‌) ప్రవేశపెట్టారు. ఈ ఏడాది కూడా 1 నుంచి 10వ తరగతి వరకు పూర్తిస్థాయిలో ఈ విధానం అందుబాటులో ఉంటుంది. ద్విభాషా పుస్తకాల ముద్రణతో విద్యార్థులకు బ్యాగుల భారం తగ్గనుంది.

జూన్‌ 12న పార్ట్‌–1 పుస్తకాల పంపిణీ..

విద్యార్థుల బ్యాగుల బరువును (బ్యాగు వెయిట్‌) తగ్గించేందుకు వీలుగా పాఠ్యపుస్తకాలను రెండు భాగాలుగా (పార్ట్‌–1, పార్ట్‌–2) ముద్రించారు. జూన్‌ 12న బడి తెరిచిన వెంటనే విద్యార్థులకు పార్ట్‌–1 పుస్తకాలను అందజేస్తారు. పార్ట్‌–2 పుస్తకాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

నాణ్యతకు ప్రాధాన్యం..

కాగితం నాణ్యతను కాపాడుతూనే బరువు తగ్గించే సాంకేతిక ప్రమాణాలను (70 జీఎస్‌ఎం పేపర్‌, 200 జీఎస్‌ఎం కవర్‌ పేజీ) ఈ విద్యాసంవత్సరం పుస్తకాల్లోనూ ఉపయోగించారు.

రెండు విడతల్లో పంపిణీ..

మండల కేంద్రాలకు చేరిన స్టాక్‌

ఈ ఏడాది జిల్లాలోని విద్యార్థులకు మొత్తం 2,35,750 (పార్ట్‌–1) పాఠ్యపుస్తకాలు అందించాల్సి ఉంది. అందులో ఇప్పటికే 1,98,430 పుస్తకాలు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఇంకా 37,320 పుస్తకాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలల్లో బుక్స్‌ పంపిణీకి సర్వం సిద్ధం

జిల్లాలో 36,839 మంది విద్యార్థులకు అందించేందుకు ఏర్పాట్లు

తొలి విడత మండల కేంద్రాలకు

1.98 లక్షల పుస్తకాలు

తరగతి విద్యార్థుల రావాల్సిన మొత్తం

సంఖ్య పుస్తకాలు (పార్ట్‌–1)

1 2,322 7,550

2 2,328 7,560

3 2,205 9,760

4 2,430 10,510

5 3,825 17,170

6 4,860 31,970

7 4,144 27,700

8 4,778 36,920

9 5,175 45,160

10 4,772 41,450

మొత్తం 36,839 2,35,750

తరగతుల వారీగా విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌, పుస్తకాల వివరాలు..

ఈవిద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాలో వివిధ తరగతుల్లో నమోదైన విద్యార్థుల వివరాలు, వారికి రావాల్సిన పార్ట్‌–1 పుస్తకాల కోటా వివరాలు..

ప్రతి విద్యార్థికి పుస్తకాల పంపిణీ..

పాఠ్యపుస్తకాల రవాణాలో ఎలాంటి ఆలస్యం జరగకుండా ఆర్టీసీ కార్గో సేవలను వినియోగిస్తున్నాం. ప్రతి పాఠశాలకు చేరే పుస్తకాలపై విద్యాశాఖ అధికారుల నిరంతర నిఘా ఉంటుంది. జూన్‌ 12వ తేదీ లోపు జిల్లాలోని ప్రతి విద్యార్థికి పాఠ్యపుస్తకాలు అందేలా పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం. బడి తెరిచిన మొదటి రోజే ‘పుస్తకాల పండుగ’ నిర్వహించి విద్యార్థులకు పంపిణీ చేస్తాం.

– రంగయ్యనాయుడు, డీఈఓ

మొదటి విడత రవాణా పూర్తి..

ప్రస్తుతం జిల్లా గౌడౌనుకు చేరుకున్న 1,98,430 పుస్తకాలను మొదటి విడత కింద ఆయా మండల కేంద్రాలకు (ఎంఈఓ కార్యాలయాలకు) రవాణా చేస్తున్నాం. ఇంకా మిగిలిన పుస్తకాలు వచ్చిన వెంటనే రెండో విడత కూడా మండలాల వారీగా పంపించి సమకూరుస్తాం.

– గారె కృష్ణమూర్తి, డీసీఈబీ కార్యదర్శి

Advertisement
 
Advertisement
Advertisement