ఖిలా వరంగల్: జిల్లాలో బక్రీద్ వేడుకలను ముస్లింలు గురువారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలు, గ్రామాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు అలయ్ బలయ్ చేసుకొని పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఖిలా వరంగల్ పెట్రోల్ బంకు జంక్షన్‌లోని ఈద్గా మైదానంలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర దేవాదాయ, పర్యాటక, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హాజరై మాట్లాడుతూ బక్రీద్ త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు.


