‘బాల్క సుమన్‌ వ్యాఖ్యలు సరికాదు’ | - | Sakshi
Sakshi News home page

‘బాల్క సుమన్‌ వ్యాఖ్యలు సరికాదు’

May 29 2026 8:04 AM | Updated on May 29 2026 8:04 AM

‘బాల్క సుమన్‌ వ్యాఖ్యలు సరికాదు’

నర్సంపేట : ప్రభుత్వ ఆస్తులను దగ్ధం చేయాలని, ప్రజలందరూ జైలుకు వెళ్లాలని బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ చేసిన వ్యాఖ్యలు సరికాదని రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఆర్‌పీఐ) బొజ్జా తారకం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జన్ను సాంబయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకేశ్వరపు రమేశ్‌ అన్నారు. పట్టణంలో ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల పైడి అధ్యక్షతన గురువారం నిర్వహించిన సమావేశంలో సాంబయ్య, రమేశ్‌ మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని కించపర్చేలా సుమన్‌ వ్యాఖ్యలు చేశారన్నారు. సుమన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎడ్ల రవి, మధుకర్‌ నాయక్‌, రాష్ట్ర కార్యదర్శి సహిదా, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి గునిగంటి రమేశ్‌, జిల్లా ఉపాధ్యక్షులు మంచాల వెంకటేశ్వర్లు, రుద్రారపు హేమలత, బుర్రి సాంబలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement