జీవితంలో కౌమారదశ కీలకం | - | Sakshi
Sakshi News home page

జీవితంలో కౌమారదశ కీలకం

May 29 2026 8:04 AM | Updated on May 29 2026 8:04 AM

జీవితంలో కౌమారదశ కీలకం

చెన్నారావుపేట : జీవితంలో కౌమారదశ కీలకమని ప్రభుత్వ వైద్యాధికారి సరోజ తెలిపారు. స్థానిక పీహెచ్‌సీలో, మండలంలోని హెల్త్‌ సబ్‌సెంటర్లలో గురువారం వరల్డ్‌ మెనుస్ట్రువల్‌ హైజీన్‌ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సదస్సులో డాక్టర్‌ సరోజ మాట్లాడారు. ఆడవాళ్లకు నెలసరి సహజమని స్పష్టం చేశారు. నెలసరి ఆరోగ్యాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సూచించారు. కౌమారదశలో శరీరంలో చోటు చేసుకునే మార్పులపై అవగాహన పెంచుకుని చైతన్యవంతం కావాలని చెప్పారు. పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ భద్రయ్య, ఏఎన్‌ఎంలు రమ, కవిత, శ్వేత, రాజకుమారి, పుష్పలత, సుధారాణి, లలిత, కాంతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement