పర్వతగిరి : మండలంలోని అన్నారం గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట సీఎం చిత్రపటానికి పంచాయతీ సిబ్బంది గురువారం క్షీరాభిషేకం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాలను ప్రతినెలా 1వ తేదీన విడుదల చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ గాడిపెల్లి మహేందర్, ఉపసర్పంచ్ గొడుగు ఏకాంతం, పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు గొడుగు రమేశ్, యూత్ మండల అధ్యక్షుడ గొడుగు వినయ్, నాయకులు గొడుగు భిక్షపతి, సారంగపాణి, జక్కుల దర్గయ్య, చెడ్డపాక కుమారస్వామి, కన్నెబోయిన మల్లయ్య, గొడుగు వీరస్వామి, పంచాయతీ సిబ్బంది రాంచందర్, ఒగ్గు యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.


