త్యాగానికి ప్రతీక బక్రీద్‌ | - | Sakshi
Sakshi News home page

త్యాగానికి ప్రతీక బక్రీద్‌

May 29 2026 8:04 AM | Updated on May 29 2026 8:04 AM

సాక్షి నెట్‌వర్క్‌ : బక్రీద్‌ను త్యాగానికి ప్రతీకగా ముస్లిం మత గురువులు అభివర్ణించారు. జిల్లావ్యాప్తంగా బక్రీద్‌ పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. అన్ని మండలాల్లోని ఈద్గాల్లో మస్జిద్‌ కమిటీల ఆధ్వర్యంలో మత గురువులు ప్రత్యేక నమాజ్‌ చదివి వినించారు. పండుగ విశిష్టత, మానవుల ఆలోచనలపై చైతన్యవంతం చేశారు. తప్పుడు ఆలోచనలు, మోసాలు, మోసపూరిత వాగ్ధానాలను వీడాలని సూచించారు. నీతి, నిజాయితీతో జీవిస్తూ సమాజ సేవలో భాగస్వాములు కావాలన్నారు. ముస్లింలు కబ్రస్తాన్లకు వెళ్లి మృతి చెందిన వారి బంధువులకు పూలు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు శుభా కాంక్షలు తెలుపుకుంటూ అలింగం చేసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement