నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ నిబంధనల ప్రకారం భూవిస్తీర్ణాన్ని బట్టి రూ.2,500ల నుంచి రూ.15,000ల వరకు, వాయు కాలుష్య నియంత్రణ చట్టం 1981 ప్రకారం గాలిని కలుషితం చేస్తే మూడు నెలల జైలు లేదంటే రూ.పది వేలు జరిమానా, ప్రజల ప్రాణాలకు, ఆరోగ్యానికి, రహదారి భద్రతకు హాని తలపెడితే భారతీయ న్యాయసంహిత 2023 ప్రకారం ఒకటి నుంచి ఆరు నెలల జైలు శిక్ష ఉంటుంది. పంట వ్యర్థాలను కాలబెడితే ఎటువంటి నోటీసులు లేకుండా రెవెన్యూ, పోలీసుశాఖ వారు కేసులు నమోదు చేస్తారు. రైతు భరోసా, వ్యవసాయ యాంత్రీకరణ సబ్సిడీలను నిలిపివేయడానికి ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తాం. – అనురాధ, జిల్లా వ్యవసాయ అధికారి
●


