న్యూశాయంపేట: పని ప్రదేశాల్లో మహిళలకు సురక్షిత వాతావరణం కల్పించడం ప్రతీ సంస్థ బాధ్యతని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రఽణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం జెడ్పీ సమావేశ హాల్‌లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కార చట్టం (పోష్ యాక్ట్–2013)పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని, పిల్లలకు చిన్నప్పటి నుంచే లింగ సమానత్వం పరస్పర గౌరవం నేర్పించాలన్నారు. షీ టీం ప్రతినిధి సుజాత మాట్లాడుతూ ఎక్కడైన వేధింపులు జరిగినట్లయితే 8712685142 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ సాంబశివరావు, డీబీసీడీఓ పుష్పలత, డీఆర్‌డీఏ శాఖల అధికారులు స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రవేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ధాన్యాన్ని త్వరగా తరలించాలి
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని త్వరగా తరలించాలని, ఇందుకోసం జిల్లాల్లో ఉన్న లారీలు, ఇతర వాహనాలతో పాటు, ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్లు సైతం వినియోగించుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. వీసీలో కలెక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా కొనుగోలు ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తూ సమన్వయంతో నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు రైతుల నుంచి 1,21,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశామన్నారు. వీసీలో ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, అధికారులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పట్టాలు
చెన్నారావుపేట: మండలపరిధిలోని జల్లి, ఎల్లాయిగూడెం, తిమ్మరాయినిపహడ్ గ్రామాల పరిధిలోని ఫార్మింగ్ సొసైటీ పరిధిలోని భూములకు సంబంధించిన భూములకు అర్హత కలిగిన అందరికీ పట్టాలు అందిస్తామని కలెక్టర్ సత్యశారద తెలిపారు. బుధవారం మండలపరిధిలోని ఎల్లాయిగూడెం శివారులోని మాధవనగర్‌లోని భూములను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కలెక్టర్ వెంట అటవీశాఖ అధికారి నికిత, సర్పంచి జినుల కనుకమల్లు, ఉపసర్పంచి కొంరయ్య, మాజీ ఎంపీపీ వీరారెడ్డి, నాయకులు ఉన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద


