సంగెం: ఉపాధి కూలీలకు పని ప్రదేశాల్లో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని డీఆర్‌డీఓ నాగపద్మజ అన్నారు. బుధవారం మండలంలోని నల్లబెల్లి గ్రామంలో కూలీలు పనిచేస్తున్న ప్రదేశాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూలీలకు ఎండలో సేదతీరేందుకు షెడ్ నెట్ ఏర్పాటు చేయాలని, సాధారణ తాగునీరు కాకుండా కూల్ వాటర్ ఏర్పాటు చేయాలన్నారు. కూలీలకు సకాలంలో వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీల్డ్ అసిస్టేంట్ గణేష్ కూలీలు పాల్గొన్నారు.
నెక్కొండ: ఉపాధి పనుల్లో వేగం పెంచాలని, కూలీలందరికీ పనులు కల్పించాలని డీఆర్‌డీఏ పీడీ నాగపద్మజ అన్నారు. మండలంలోని దీక్షకుంట, చంద్రుగొండ గ్రామాల్లో బుధవారం ఉపాధి హామీ పనులతోపాటు ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా కొనుగోళ్లు జరపాలన్నారు. అలాగే చంద్రుగొండలో మునగ తోటలో జరిగిన అవకతవకలపై ఫిర్యాదు మేరకు ఎంపీడీఓ లావణ్యను విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రంమలో ఏపీఓ జాకబ్, చంద్రుగొండ సర్పంచ్ బక్కి కవిత, కార్యదర్శులు భానుప్రకాశ్, సుమన్, రైతులు, కూలీలు, తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌డీఏ పీడీ నాగపద్మజ


