● వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్
నర్సంపేట రూరల్: బక్రీద్‌ను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకోవాలని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ అన్నారు. నర్సంపేట పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌లో ముస్లిం పెద్దలతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, సీఐ శ్రీనివాస్, దుగ్గొండి సీఐ సాయిరామన్న, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి, బస్తాలను త్వరగా తరలించాలని ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్ అన్నారు. నర్సంపేట మండలంలోని లక్నెపల్లి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని, నర్సంపేట వ్యవసాయ మార్కెట్‌ను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. వాతావరణంలో జరుగుతున్న మార్పుల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఏసీపీ రవీందర్, సీఐ శ్రీనివాస్, ఎస్సై గూడ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.


