ఎమ్మెల్యే సంతాపం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే సంతాపం

May 28 2026 12:46 AM | Updated on May 28 2026 12:46 AM

వర్ధన్నపేట: ప్రముఖ దినపత్రికలో పనిచేస్తున్న సీనియర్‌ పాత్రికేయుడు, పట్టణ కేంద్రానికి చెందిన శ్రీరాం రమేశ్‌(63) గుండెపోటుతో ఆకస్మికంగా మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఈ నెల 11న చార్‌ధామ్‌ యాత్రకు వెళ్లిన రమేశ్‌ కుటుంబం యాత్రను ముగించుకుని సోమవారం రాత్రికి స్వస్థలానికి చేరుకోవాల్సి ఉంది. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి స్వస్థలానికి బయలుదేరే సమయంలో అస్వస్థతకు గురికాగా వెంటనే కుటుంబ స భ్యులు ఢిల్లీలోనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. రమేష్‌ ఆ కస్మిక మరణం తీవ్ర దిగ్‌భ్రాంంతికి గురిచేసిందని ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు సంతాపం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement