ఖానాపురం : మహిళలు స్వయం ఉపాధిలో రాణించాలని ఎంపీడీఓ అద్వైత, మహిళా సాధికారిత జెండర్ స్పెషలిస్ట్ నల్లా హర్షితలు అన్నారు. మండలంలోని అశోక్‌నగర్ గ్రామపంచాయతీ ఆవరణలో రెండు వారాలుగా చేపట్టిన మహిళా, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జూట్‌బ్యాగ్ తయారీ శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో జూ ట్‌బ్యాగులను వినియోగించుకోవాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో జూట్‌బ్యాగుల వినియోగం ఉపయోగపడుతుందన్నారు. వ్యాపారంగా మలుచుకొని అభివృద్ధి కావడానికి ఉపయోగపడుతుందన్నారు. 15 రకాల జూట్‌బ్యాగుల తయారీలో 26 మంది మహిళలు శిక్షణ పొందారు. కార్యక్రమంలో సీడీపీఓ మధురిమ, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రమ, మహిళా సాధికారిత కేంద్రం బాధ్యురాలు హర్షిత, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


