ఖానాపురం : అనుమతులు లేకుండా మట్టి తరలించొద్దని మైనింగ్ ఏడీ రవిశంకర్, తహసీల్దార్ నంగునూరి రమేశ్ అన్నారు. మండలంలోని బుధరావుపేట శివారులో మట్టితరలింపు చేపట్టిన ప్రదేశాలను బుధవారం వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మట్టితీసిన భూమిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై ఎఫ్‌లైన్ పిటిషన్ దరఖాస్తు చేసుకోవాలని భూ యజమానికి సూచన చేశారు. ఫారెస్ట్ భూమిలో మట్టి తరలించిన ప్రదేశాన్ని పరిశీలించి గతంలోనే జరిమానాలు విధించినట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అక్రమంగా మట్టితరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఆర్వో సుధాకర్, ఆర్‌ఐ స్వామి, తదితరులు పాల్గొన్నారు.


